ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను సస్పెండ్ చేయాలి: శేజల్

తనపై లైంగిక వేధిస్తున్న  బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని  ఆరిజిన్ డెయిరీ సీఈవో శేజల్ ప్రశ్నించారు.  ఆడపిల్లల వైపు అసభ్యంగా చూస్తే గుడ్లు పీకుతా అన్న కేసీఆర్ కు... తాను  వంద రోజులుగా ఆందోళన చేస్తున్నా కనబడడం లేదా అంటూ ప్రశ్నించారు. ఇవాళ ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఆమె ఆందోళనకు దిగారు. తాను 25 రోజులుగా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని  ఆవేదన వ్యక్తం చేశారు. తన పక్కలోకి వెళ్లకపోతే  ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన వ్యాపారాలు  చేసుకోనివ్వరని  ఆరోపించారు. తమకు తెలంగాణలో స్వేచ్ఛ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్ల అని కూడా ఆలోచించకుండా తనను వేధిస్తున్నారన్నారు.

తప్పుడు కేసులు బనాయించి రిమాండ్ కు పంపి తన జీవితాన్ని సర్వనాశనం చేశారని శేజల్ ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గం చిన్నయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయనపై వేటు వేయని పక్షంలోఢిల్లీలోని పార్టీ కార్యాలయం ముందు ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు. కేసీఆర్ నాగపూర్ లో బీఆర్ఎస్ కార్యాయంప్రారంభోత్సవానికి వెళ్తుండటంతో ఢిల్లీలోని పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపినట్టు ఆమె వివరించారు.