ఉప్పల్లో నకిలీ గోల్డ్​ పెట్టి ఒరిజనల్ ​గోల్డ్​ చోరీ

ఉప్పల్లో నకిలీ గోల్డ్​ పెట్టి ఒరిజనల్ ​గోల్డ్​ చోరీ

ఉప్పల్, వెలుగు : ఉప్పల్ ​పీఎస్​పరిధిలో ఓ జంట గోల్డ్​షాపు యజమానికి మస్కా కొట్టింది. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.20 వేలు తీసుకోవడమే కాకుండా, పోతూ గోల్డ్​షాపులో 12 వన్​గ్రామ్​గోల్డ్ నాణేలు ఎత్తుకెళ్లింది. కావలి లక్ష్మి(35), తిరుపతి(42) భార్యాభర్తలు. శుక్రవారం వీరిద్దరూ ఉప్పల్ భరత్ నగర్ లోని జ్యువెలరీ షాపుకు వచ్చారు. 5 గ్రాముల బంగారు చెవి కమ్మలు తాకట్టు పెట్టి షాపు యజమాని తండ్రి దేవి లాల్ శర్మ వద్ద రూ.20 వేలు తీసుకున్నారు. తర్వాత షాపుకు వచ్చిన యజమాని దేవీలాల్ రాకేశ్​తాకట్టు పెట్టిన బంగారాన్ని పరిశీలించగా అది వన్ గ్రామ్ గోల్డ్ అని తెలిసింది. 

వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించగా లక్ష్మి, తిరుపతి దంపతులు దేవీలాల్​శర్మకు మస్కా కొట్టినట్లు గుర్తించాడు. పైగా వారు షాపులోని 12 వన్​గ్రామ్​లక్ష్మీదేవి బంగారు నాణేలు ఎత్తుకెళ్లినట్లు తెలుసుకున్నాడు. అతని ఫిర్యాదుతో పోలీసులు వారిని పట్టుకున్నారు.  24 గంటల్లోనే కేసును ఛేదించారు.