
పద్మారావునగర్, వెలుగు: టోసాకాన్-2025లో భాగంగా గాంధీ ఆసుపత్రి ఆర్థో పెడిక్ విభాగం ఆధ్వర్యంలో గురువారం హిప్ ఆర్థోరోస్కోపీ, క్యాడవరి లైవ్ సర్జరీ వర్క్ షాప్ నిర్వహించారు. తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ తిమ్మారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, ఆర్థో పెడిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ బి.వాలియా, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర, ఫోరెన్సిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కృపాల్ సింగ్, నిమ్స్ ఆర్థోపెడిక్ హెచ్ఓడీ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎస్సై జాబ్‌కు ప్రిపేర్ అవుతున్న ఓ యువతికి తుంటి భాగంలో గాయం కావడంతో విజయవంతంగా హిప్ ఆర్థోస్కోపీ సర్జరీ నిర్వహించారు. ఫోరెన్సిక్ విభాగం సహకారంతో ఓ మృతదేహానికి ఆపరేషన్ నిర్వహించి జూనియర్ ఆర్థో డాక్టర్లకి లైవ్డెమో ఇచ్చారు.