కరీంనగర్, వెలుగు : 50 ఏండ్లు దాటినవారు ఎముకల వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని రెనీ హాస్పిటల్ అధినేత, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ లయన్ డాక్టర్ బంగారి స్వామి సూచించారు. పురుషుల కన్నా మహిళలకు ఎముకల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని తెలిపారు. శుక్రవారం వరల్డ్ ఆస్టియోపోరెసిస్ డే సందర్భంగా రెనీ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, శాతవాహన లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన
'డాక్టర్ బంగారి స్వామితో ముఖాముఖి'లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో లయన్ కెప్టెన్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, అరవింద్ రావు, రెండో ఉప గవర్నర్ కోదండరాం, నర్సింగ రావు, రమేశ్, పి.శ్రీహరి రెడ్డి, సీతారాంరెడ్డి, హాస్పిటల్ డైటిషీయన్స్ఫూర్తి, సిబ్బంది పాల్గొన్నారు .