- ఎయిర్ పోర్టు, రింగ్ రోడ్డు, ఇతర పనులతో రియల్‌రంగంపై పెరిగిన హోప్స్
- కొంతకాలంగా బిజినెస్ నడవక అంతా డల్
- రెండో రాజధానికి అడుగులు పడుతుండడంతో చిగురించిన ఆశలు
- రియల్ ఎస్టేట్పుంజుకుందంటున్న వ్యాపారులు
హనుమకొండ, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం ఓరుగల్లును రెండో రాజధానికిగా చేస్తామని ఆ దిశగా అడుగులు వేస్తుండడంతో రియల్ఎస్టేట్రంగానికి ఊపిరి పోసినట్లయ్యింది. దాదాపు ఏడెనిమిది నెలలుగా డల్ గా సాగిన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. కొంతకాలంగా వ్యవసాయ భూములు, ఇండ్ల ప్లాట్ల క్రయవిక్రయాలు సరిగా జరగక అమ్మకందారులు, రియల్టర్లు తమ పాత ఫీల్డ్బాట పట్టారు.
తాజాగా రాష్ర్ట కాంగ్రెస్ప్రభుత్వం మామునూరు ఎయిర్‌పోర్టుతోపాటు, రింగ్‌రోడ్డు, ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో వివిధ ఇండస్ట్రీలు ఇక్కడికి క్యూ కట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇక్కడి భూముల ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. భూముల క్రయవిక్రయాలు జరుపుదామనుకునేవారితో పాటు రియల్ వ్యాపారుల్లో ఆశలు
రేకెత్తుతున్నాయి.
కొత్త ప్రాజెక్టులతో మళ్లీ హోప్స్..
మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు శ్రీకారం చుట్టి భూసేకరణకు నిధులు కూడా విడుదల చేసింది. రింగ్‌రోడ్డును పూర్తి చేసేందుకు ఫండ్స్ ఇచ్చింది. సిటీలో అండర్ గ్రౌండ్డ్రైనేజీతోపాటు వివిధ అభివృద్ధి పనులకు మొత్తంగా రూ.6 వేల కోట్లకు పైగా కేటాయించి, పనులు చేపట్టింది. కాజీపేటలో వ్యాగన్తయారీ వర్క్‌షాప్, కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఇక్కడికి వాటి అనుబంధ రంగాలకు సంబంధించిన ఇండస్ట్రీలు కూడా తరలిరానున్నాయి. ఇవన్నీ ప్రాజెక్టులతో వరంగల్ తొందర్లోనే ఫ్యూచర్ సిటీగా డెవలప్కానుంది. దీంతో వరంగల్ చుట్టుపక్కల దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధి వరకు ఇప్పుడు మళ్లీ భూముల ధరలు పెరుగుతున్నాయి.
Also Read :- కొత్తగూడెంలో నిర్మాణాలు కట్టారు.. వదిలేశారు
గతంలో ఎన్‌హెచ్-163 బైపాస్(రింగ్‌రోడ్డు) సమీపంలో ఎకరాకు రూ.నాలుగైదు కోట్ల వరకు ఉండగా, ఇప్పుడు ఆ రేటు ఇంకాస్త పెరిగింది. మామునూరు ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రేట్లు అమాంతం పెంచేశారు. దీంతో నగర శివారుల్లో భూములున్న రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. నగరంతో పాటు చుట్టుపక్కల ఏర్పాటవుతున్న ప్రాజెక్టులు రియల్ఎస్టేట్రంగానికి కలిసొచ్చే అంశం కావడంతో ఇప్పుడిప్పుడే రియల్భూమ్మళ్లీ పుంజుకుంటోంది. పెట్టుబడులతోపాటు భూముల క్రయవిక్రయాలకు వ్యాపారులు, జనాలు ముందుకొస్తుండటంతో రియల్ఎస్టేట్రంగం మళ్లీ గాడిన పడినట్లయ్యింది. దీంతో రియల్ఎస్టేట్వ్యాపారుల్లో కూడా బిజినెస్‌పై ఆశలు రేకెత్తుతున్నాయి.
గతంతో పోలిస్తే తగ్గిన రిజిస్ట్రేషన్లు..
ఓరుగల్లు నగరంలో కొంతకాలం కిందటి వరకు రియల్ఎస్టేట్బిజినెస్బాగానే జరిగింది. కూలీ పనులు, ప్రైవేటు ఉద్యోగాలు, ఇతర బిజినెస్‌లు చేసేవాళ్లంతా రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చారు. ఫలితంగా భూముల క్రయవిక్రయాలు పెద్ద సంఖ్యలో ఉండేవి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 రిజిస్ట్రేషన్ఆఫీసులు ఉండగా, వాటన్నింటిలో నెలకు 9 వేల నుంచి 10 వేల వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. సగటున రూ.32 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది.
కానీ, కొంతకాలంగా బిజినెస్స్తబ్ధుగా ఉండటంతో చాలామంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకు సగటున 7 వేల నుంచి 8 వేల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగగా, ప్రభుత్వానికి రూ.25 కోట్లకు మించి ఆదాయం రాకపోవడం గమనార్హం. క్రయవిక్రయాలు జరగక ఇటు భూములు అమ్ముకునేవారితోపాటు వ్యాపారులు లావాదేవీలు ఏమీ జరక్క కొంతమంది రియల్టర్లు ఈ బిజినెస్వదిలేసి తమ పాత పనులకే వెళ్లడం మొదలుపెట్టారు.