తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఓరుగల్లుది కీలక పాత్ర: ఎమ్మెల్సీ వాణీదేవి

హనుమకొండ, వెలుగు: తెలంగాణ ఉద్యమ చరిత్రను నేటి తరానికి తెలియజెప్పాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ, దీక్షాదివస్​ హనుమకొండ జిల్లా ఇన్​చార్జ్​ వాణీదేవి అన్నారు. ఈనెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్​సన్నాహక సమావేశాన్ని మంగళవారం వరంగల్ బాలసముద్రంలోని బీఆర్ఎస్​హనుమకొండ జిల్లా ఆఫీస్‎లో మాజీ చీఫ్​విప్​ దాస్యం వినయ్​భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా వాణీదేవి మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో ఓరుగల్లుది కీలక పాత్ర అని పేర్కొన్నారు. దీక్షా దివస్​ సందర్భంగా ఉద్యమ చరిత్రను తెలిపేలా ఫొటో ఎగ్జిబిషన్​పెట్టాలన్నారు. అమ‌‌‌ర‌‌‌‌వీరులు, ఉద్యమకారులను సన్మానించాలన్నారు. స్వరాష్ట్ర సాధనకు బీఆర్ఎస్​ కృషిని మ‌‌‌‌రోసారి తెలియ‌‌‌‌జేయాలని, దీక్షా దివస్​విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, వొడిత‌‌‌‌ల స‌‌‌‌తీష్ బాబు, నేతలు పాల్గొన్నారు.