దిగ్గజ పారిశ్రామికవేత్త ఒసాము సుజుకీ కన్నుమూత

దిగ్గజ పారిశ్రామికవేత్త ఒసాము సుజుకీ కన్నుమూత

న్యూఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, సుజుకీని ప్రపంచవ్యాప్తం చేసిన ఆ సంస్థ మాజీ చైర్మన్. ఒసాము సుజుకీ (94) కన్నుమూశారు. క్యా న్సర్ తో బాధపడుతున్న ఈనెల 25న ఆయన మరణించినట్లు సుజుకి మోటార్ కార్పొరేషన్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. జపాన్ లోని గెరోలో 1930 జనవరి 30న జన్మించిన ఒసాము.. 1958లో సుజుకీలో చేరారు. 

ALSO READ | మీకు తెలుసా: ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారు కదా.. వీటిని తీసుకొచ్చింది ఈ మన్మోహన్ సింగ్నే..

తన భార్య ఇంటిపేరును తీసుకొని, ప్రపంచవ్యాప్తం గా చిన్న కార్లు & మోటార్ సైకిళ్లను పరిచయం చేసి దాన్నే బ్రాండ్గా మార్చేశారు. తక్కువ కాలంలోనే సంస్థకు గుర్తింపు తీసుకొచ్చారు. దాదాపు 21 ఏండ్ల పాటు సంస్థ చైర్మన్ గా కొన సాగారు. ప్రస్తుతం భారత్ లో మారుతీ సుజుకీ అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉంది.