Robert Towne: ఆస్కార్ అవార్డు విన్నర్ మృతి.. ఎలా పోయారనేది మిస్టరీ!

Robert Towne: ఆస్కార్ అవార్డు విన్నర్ మృతి.. ఎలా పోయారనేది మిస్టరీ!

ఆస్కార్ అవార్డు విన్నర్, అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత, సినీ దర్శకుడు రాబర్ట్ టౌన్(89) మరణించారు. సోమవారం(జులై 01) ఆయన తుది శ్వాస  విడిచారు. రాబర్ట్ మరణాన్ని ఆయన మేనేజర్ క్యారీ మెక్‌క్లూర్ బుధవారం(జులై 03) మీడియాకు వెల్లడించారు. అయితే, ఆయన మరణానికి గల కారణాలు ఏంటనేది మెక్‌క్లూర్ వెల్లడించలేదు. అందునా, చనిపోయి రెండ్రోజులు గడిచే వరకూ ఎందుకు దాచిపెట్టారనేది మిస్టరీగా మారింది.

నవంబర్ 23, 1934న జన్మించిన రాబర్ట్ టౌన్ ప్రసిద్ధ స్క్రీన్ రైటర్. హాలీవుడ్‌లోని ప్రతిష్టాత్మక రచయితలలో ఆయనొకరు. 1960లో వచ్చిన 'లాస్ట్ ఉమెన్ ఆన్ ఎర్త్' స్క్రిప్ట్‌తో కెరీర్‌ను ప్రారంభించిన రాబర్ట్.. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్నారు. 1970లలో 14 నెలల వ్యవధిలో 'ది లాస్ట్ డిటెయిల్', 'చైనాటౌన్', 'షాంపూ' అనే మూడు విమర్శనాత్మక చిత్రాలను ఆయన తెరకెక్కించారు. ఈ మూడు చిత్రాల స్క్రిప్ట్‌లు ఆస్కార్‌కు నామినేట్ చేయబడ్డాయి. వీటిలో 'చైనాటౌన్' చిత్రానికి రాబర్ట్‌కు ఆస్కార్ లభించింది. ఇది ఉత్తమ చిత్రంతో సహా 11 అకాడమీ అవార్డులకు నామినేట్ చేయబడింది. అనంతరం 1997లో 'రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా' చిత్రానికిగానూ ఆయనను 'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్' అవార్డుతో సత్కరించారు.