ఒక్కసారైనా నేషనల్ అవార్డ్ అందుకోవాలనేదే తన కోరికని ఆస్కార్ విన్నర్, ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. ఆస్కార్ అవార్డ్ అందుకున్న తర్వాత చంద్రబోస్ మొదటి సారిగా తన స్వగ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగేకు వెళ్లారు. అక్కడ చంద్రబోస్ కు గ్రామస్తులు, స్నేహితులు ఘన స్వాగతం పలికారు. చంద్రబోస్ దంపతులను సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబోస్ తనకు గొప్పగా స్వాగతం పలికిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. నాటు నాటు పాట ఖండంతరాలు దాటి ఆస్కార్ అవార్డు వరించిందన్నారు. మొట్టమొదటి ఆస్కార్ భారతదేశంలోనే చల్లగరిగే గ్రామానికి వచ్చిందని తెలిపారు. తనకు ఆస్కార్ రావడంతో గ్రామ ప్రజలు పండగ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. తాన స్వగ్రామంలో లైబ్రరీని పునర్మిస్తానని చెప్పారు. ఇప్పటి వరకు తాను 3600 పాఠలు రాశానని.. 4 ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయని తెలిపారు. అయితే తన జీవితంలో ఒక్కసారైనా జాతీయ అవార్డు అందుకోవాలనేది కోరికని..కానీ ఇంత వరకు రాలేదన్నారు.