కుక్కల కోసం డాగీ విల్లే..ప్రారంభించిన చంద్రబోస్​

కుక్కల కోసం డాగీ విల్లే..ప్రారంభించిన చంద్రబోస్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: శునకం మనిషికి అత్యంత ఆత్మీయ నేస్తమని, నిస్వార్థంగా మనల్ని ప్రేమించే వాటిని తిరిగి ప్రేమించడం, వాటి బాగోగులు చూడడం మన బాధ్యత అని సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అన్నారు. బంజారా హిల్స్‌‌‌‌ రోడ్ నంబర్.11లో ఏర్పాటు చేసిన ‘డాగీ విల్లే’ని మంగళవారం ఆయన ప్రారంభించారు. సెంటర్ ను చూసి తనలో కలిగిన భావోద్వేగాలని ఆయన అప్పటికప్పుడు ఓ పాట రూపంలో ఆకట్టుకునేలా పాడి వినిపించారు.

డాగీ విల్లే వ్యవస్థాపకురాలు అమృత వర్షిణి నల్ల మాట్లాడుతూ తమ డాగీ విల్లేలో కేజ్ -ఫ్రీ బోర్డింగ్, డే కేర్, స్పెషల్​ట్రైనింగ్, స్పా, బిహేవియర్ థెరపీ, డాగ్ బోర్డింగ్, గ్రూమింగ్, డాగ్ వాకర్, స్పా వంటి అనేక రకాల సర్వీస్​లు అందిస్తామన్నారు. కస్టమర్స్ సంప్రదిస్తే శునకాలను ఏసీ కార్ లో పికప్.. డ్రాప్ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు.