అనాటమీ ఆఫ్ ఎ ఫాల్(Anatomy Of a Fall).. గత కొంతకాలంగా ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కారణం.. ఈ సినిమా ఇటీవల జరిగిన 96వ ఆస్కార్(96th Oscar) వేడుకల్లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో అవార్డు సాధించడమే. కేవలం ఆస్కార్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా ప్రెస్టీజియస్ అవార్డులను దక్కించుకుంది ఈ సినిమా. అందుకే ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది.
తాజాగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. క్రైమ్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఊహకందని కథ, కథనాలతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. అందుకే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇటీవల ఆస్కార్ వచ్చాక ఆ ఆసక్తి ఇంకా పెరిగింది. దాంతో.. ఈ సినిమాను ఓటీటీలో అధికారికంగా విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ సినిమా ఇప్పటికే ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉండగా.. తాజాగా రీజనల్ భాషలైన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీలో విడుదల చేశారు మేకర్స్. తాజా అప్డేట్ తో ఆడియన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇక అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ సినిమా కథ విషయానికి వస్తే.. సాండ్రా హుల్లర్ ఒక రచయిత. ఆమె తన భర్తతో కలిసి మంచుకొండల్లో నివసిస్తూ ఉంటుంది. ఒకరోజు సాండ్రా భర్త అనుమానాస్పద స్థితిలో హత్య చేయబడతాడు. ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ఎవరు లేకపోవడంతో.. సాండ్రా నే అతన్ని హత్య చేసిందని అనుమానిస్తారు పోలీసులు. అక్కడి నుండి అనుకోని మలుపులు తిరుగుతూ ఆడియన్స్ కు ఉత్కంఠను కలిగిస్తుంది. నిజంగా సాండ్రా నే తన భర్తను హత్య చేసిందా? చివరికి ఎం జరిగింది అనేది మిగిలిన కథ.