లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు (LA wildfires) ఆస్కార్ అవార్డ్స్కు (Oscars 2025) అంటుకుంది. అదేంటని షాక్ అవుతున్నారా? అవును నిజమే. లాస్ ఏంజిల్స్‌లో భీకరమైన మంటలు చెలరేగడంతో 2025 ఆస్కార్ నామినేషన్లు రెండోసారి వాయిదా పడినట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తెలిపింది.
ఈ మేరకు అకాడమీ X లో పోస్ట్ చేస్తూ.. "లాస్ ఏంజెలెస్‌లో కొనసాగుతున్న మంటల కారణంగా ఆస్కార్ ఓటింగ్ వ్యవధిని పొడిగించి, సభ్యులకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము" అని అకాడమీ సీఈవో బిల్ క్రేమర్, అధ్యక్షురాలు జానెట్ యాంగ్ తెలిపారు.
97వ ఆస్కార్ అవార్డుల నామినేషన్ల ప్రకటన వాస్తవానికి జనవరి 17న జరగాల్సి ఉంది. తర్వాత దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో చెలరేగుతున్న అడవి మంటల నేపథ్యంలో జనవరి 19కి వాయిదా పడింది. దాంతో ఇప్పుడు ఈ వేడుక మరింత ఆలస్యమైంది. ఇకపోతే ఆస్కార్ నామినేషన్లు జనవరి 23, గురువారం మధ్యాహ్నం 1:30 PM GMT కి ప్రకటించబడతాయని అకాడమీ బృందం ధృవీకరించారు .
ALSO READ | ఎటు చూసినా బూడిదే.. ఆగని లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు.. 25కు చేరిన మృతుల సంఖ్య
అయితే, ఆస్కార్ 2025 నామినేషన్స్‌కు సంబంధించిన ఓటింగ్ 2025 జనవరి 8న మొదలైంది. జనవరి 12న ముగించాల్సి ఉంది. నామినీల తుది జాబితా జనవరి 17న ఫైనల్ లిస్ట్‌ను ఆస్కార్ అకాడమీ ప్రకటించబోతున్నట్లు అనౌన్స్ కూడా చేసింది. అలాగే అకాడమీ అవార్డుల వేడుక మార్చి 2న ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనున్నట్లు కూడా తెలిపింది. అయితే ఇప్పుడు ఆస్కార్ 2025 నామినేషన్స్ పూర్తి షెడ్యూల్ మారిపోయింది. లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు విషాదం జనవరి 7 నుండి ఇప్పటికే 15,000 హెక్టార్లలో కాలిపోయింది. ఎన్నో భవంతులు అగ్నికి ఆహుతయ్యాయి. మరికొంతమంది ప్రాణాలను ఈ కార్చిచ్చు బలిగొంది.
The Academy Museum is open today and will offer all visitors free general admission this weekend.
— The Academy (@TheAcademy) January 11, 2025
Our thoughts and condolences are with everyone impacted by the devastating wildfires. We are grateful the museum can continue to offer a safe gathering space for the community.… pic.twitter.com/vgi5X5jSbE
97వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్లకు అర్హత సాధించిన సినిమాల జాబితాను అకాడమీ సంస్థ తాజాగా(జనవరి 7, 2025) విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళ చిత్రం ‘కంగువ’ కూడా నిలిచింది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం 6 సినిమాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఆ సినిమాల్లో ‘ఆడు జీవితం’(మలయాళం), ‘కంగువ’ (తమిళం), గర్ల్స్ విల్ బి గర్ల్స్ (హిందీ, ఇంగ్లిష్), ‘సంతోష్’ (హిందీ), ‘స్వాతంత్ర్య వీర సావర్కర్’ (హిందీ), ‘All We Imagine as Light’ (మలయాళం) సినిమాలు నిలిచాయి.