Oscar Category: ఆస్కార్ రేసులో కొత్త కేటగిరీ.. 2027 నుంచి అవార్డులు షురూ

Oscar Category: ఆస్కార్ రేసులో కొత్త కేటగిరీ.. 2027 నుంచి అవార్డులు షురూ

‘ఆర్ఆర్ఆర్’చిత్రాన్ని ఆస్కార్ వరకు తీసుకెళ్లి ఇండియన్ సినిమా సత్తాను చాటారు రాజమౌళి. ఈ సినిమాతో ప్రపంచమంతా తెలుగు సినిమావైపు చూసేలా చేశారు. అయితే ఆయన ఎన్నేళ్లుగానో వేచి చూస్తున్న  ఓ అవార్డును ఆస్కార్ రేసులో పెట్టినట్టు శుక్రవారం అకాడమీ ప్రకటించింది.

ఇప్పటివరకు లేని స్టంట్ డిజైన్ కేటగిరీకి  ఆస్కార్ అవార్డులు అందజేయనున్నట్టు తెలియజేసింది. 2028కి ఆస్కార్ అవార్డులు ప్రారంభించి వందేళ్లు అవుతున్న సందర్భంగా 2027లో విడుదలయ్యే సినిమాల నుంచి ఈ అవార్డును ఇవ్వనున్నట్టు పోస్ట్ చేశారు. ఈ అనౌన్స్‌‌మెంట్ సందర్భంగా అకాడమీ రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో ‘ఆర్ఆర్ఆర్’చిత్రాన్ని కూడా యాడ్ చేయడం స్పెషల్ అట్రాక్షన్‌‌గా నిలిచింది.

ఈ పోస్ట్‌‌కు రాజమౌళి స్పందిస్తూ ‘ఎట్టకేలకు  వందేళ్ల నిరీక్షణ తర్వాత.. 2027లో విడుదలయ్యే చిత్రాలకు ఆస్కార్‌‌‌‌లో స్టంట్ డిజైన్ కేటగిరీని యాడ్ చేయడం చాలా ఆనందంగా  ఉంది.  ఈ చారిత్రాత్మక గుర్తింపును సాధ్యం చేసినందుకు డేవిడ్ లీచ్, క్రిస్ ఓహర, అకాడమీ సీఈవో బిల్ క్రామర్, అకాడమీ ప్రెసిడెంట్‌‌ జానెట్ యాంగ్‌‌కు స్పెషల్ థ్యాంక్స్’అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అలాగే ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన యాక్షన్ విజువల్‌‌ను అనౌన్స్‌‌మెంట్ పోస్టర్‌‌‌‌లో పెట్టడం థ్రిల్ అయ్యానని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం మహేష్‌‌ బాబుతో  హాలీవుడ్ రేంజ్ మూవీని రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్‌‌ మూవీగా రాబోతున్న ఈ చిత్రంతో  2027 నుంచి రానున్న   యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌‌ కేటగిరీలో ఈ సినిమా కూడా ఉండేలా ప్లాన్ చేస్తారేమో చూడాలి.