రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషీ(Khushi). క్లాసిక్ సినిమాలా డైరెక్టర్ శివ నిర్వాణ(Shiva nirvana) డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఐదవ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్.. భార్యల చేత విసుగు చెందిన భర్తల సాంగ్గా కనిపిస్తోంది. ఈ సాంగ్ను తెలంగాణ స్లాంగ్లో ప్రజెంట్ చేయడంతో..ఆడియన్స్లో క్యూరియాసిటీ పెంచేశారు మేకర్స్.
కాశ్మీర్లో ఫస్ట్ టైం తనని చూసిన..ముందెనుక చూడకుండా మనసిచ్చినా..బాబు మాట పక్కనెట్టి బయటికి వచ్చినా..లగ్గమెట్టీ కాపురాన్ని స్టార్ట్ చేసిన.. అంటూ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట ఆకట్టుకుంటోంది. అలాగే మరో సింగర్ సాకేత్ పాడుతూ..ఓసి పెళ్లామా..నన్ను మిర్చిలాగ నంజుకుంటావే.. అంటూ భర్తల కష్టాలను చూపించారు. ఉన్నమాట చెపుతాను వినుకొండ్రీ.. పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రీ.. అంటూ శివ నిర్వాణ రాసిన లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. దీంతో మగజాతి ఖాతాలోకి మరో సాంగ్ వచ్చి పడిందంటూ ఫ్యాన్స్..ఫ్లోర్ డ్యాన్స్ చేస్తున్నారు.
ఇక అబ్దుల్ వాహబ్ ఎలక్ట్రిఫైయింగ్ ట్యూన్తో ఖుషి మూవీపై అంచనాలు పెంచేశారు. ఈ సాంగ్తో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు.. ముఖ్యంగా భర్తలు డ్యాన్స్ ఫ్లోర్ చేస్తారని విషయం అర్ధం అవుతుండగా..అందుకు మగజాతి అంతా సిద్ధంగా ఉండాలని టీమ్ ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్,టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్ను ఎంతో ఆకట్టుకున్నాయి.
నిన్ను కోరి, మజిలి, టక్ జగదీష్ సినిమాలు తీసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఖుషి సినిమా థియేటర్లలో 2023 సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.