ఉస్మానియా ఆస్పత్రిలో అరుదైన చికిత్స..మూడేండ్ల బాబుకు లివర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంటేషన్

ఉస్మానియా ఆస్పత్రిలో అరుదైన చికిత్స..మూడేండ్ల బాబుకు లివర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంటేషన్

హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లాకు చెందిన మూడేండ్ల బాబుకు ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్లు విజయవంతంగా కాలేయ మార్పిడి చికిత్స చేశారు. జిల్లాలోని కొండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల గ్రామానికి చెందిన మోదుగు గుణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శేఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల దంప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తుల కుమారుడు చోహ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ ఆదిత్య.. పిత్తాశ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య ధ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, కాలేయ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్యతో జన్మించాడు. చోహ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ ఆదిత్యను ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిశీలించిన ఉస్మానియా డాక్టర్లు కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. 

డాక్టర్ మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధుసూద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ నేతృత్వంలోని స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్జిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ గ్యాస్ట్రో ఎంట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ, కాలేయ మార్పిడి బృందం ఈ నెల 3న ఆదిత్యకు కాలేయ మార్పిడి ఆపరేషన్ చేసింది. ఆదిత్య తల్లి అమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కాలేయాన్ని త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న కుమారునికి దానం చేసింది. డాక్టర్లు ఆమె కాలేయం నుంచి కొంత భాగాన్ని తీసి బాలునికి అమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్చారు. ప్రస్తుతం త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని, వారిని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి డిశ్చార్జ్ చేశామని డాక్టర్లు మంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ళ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వారం  వెల్లడించారు. 

ఇప్పటివరకు ఉస్మానియాలో 30 మందికి కాలేయ మార్పిడి చికిత్సను విజయవంతంగా చేశామని హాస్పిటల్ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్ నాగేందర్ తెలిపారు.