ఉస్మా‘నయా హాస్పిటల్’​ కు అడుగులు

ఉస్మా‘నయా హాస్పిటల్’​ కు అడుగులు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణం కోసం చకచకా అడుగులు పడుతున్నాయి. గోషామహల్ గ్రౌండ్స్​లో  కొత్త భవనం నిర్మించాలని సీఎం ఆదేశించడంతో.. అక్కడి పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్​ను పేట్ల బురుజులోని పోలీసు అకాడమీకి రిలొకేట్ చేయడానికి సాధ్యాసాధ్యలను హైదరాబాద్ కలెక్టర్​అనుదీప్ ఫీల్డ్​ లెవెల్​లో పరిశీలన జరిపారు. అడిషనల్ డీసీపీ భాస్కర్, ఆర్డీవో జ్యోతితో కలిసి పోలీసు అకాడమీని పరిశీలించారు. . అకాడమీలో మొత్తం 12 ఎకరాల స్థలంఉన్నట్లు రెవెన్యూ అధికారులు కలెక్టర్​కు వివరించారు.

ఇందులో 6 ఎకరాల్లో గ్రౌండ్ ఉండగా, మిగతా ఆరు ఎకరాల్లో పోలీస్​ ట్రైనింగ్​కు సంబంధించిన ఆఫీసులు, శిథిలావస్థలో పలు భవనాలు ఉన్నట్లు చెప్పారు. అకాడమీకి ఎదురుగా ఉన్న పోలీస్​ ట్రాన్స్​పోర్టు ఆర్గనైజేషన్​లో సుమారు 5.27 ఎకరాలు, దాని పక్కనే ఉన్న సిటీ ట్రాన్స్​పోర్టు ఆర్గనైజేషన్​లో  మరో 6 ఎకరాల స్థలం ఉండొచ్చని చెప్పారు. ఈ రెండు స్థలాలను కూడా పరిశీలించి, త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు కలెక్టర్ అనుదీప్ వివరించారు.