కోల్ కతా మహిళా వైద్యురాలిని అత్యాచారం.. హత్య చేసిన సంజయ్ రాయ్ ను దోషిగా పరిగణించి సీల్దా కోర్టు శిక్ష ఖరారు చేయడంపై స్వాగతించారు. హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వైద్యులు సమావేశం అయ్యారు. కోర్టు నిర్ణయాన్ని పలువురు వైద్యులు స్వాగతించారు. అయితే సంజయ్ రాయ్ కు జీవిత శిక్ష కాదని.. మరణ శిక్ష విధించాలని దేశ వ్యాప్తంగా వస్తున్న డిమాండ్ ను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవాలని మెడికోస్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర బాబు విజ్ఞప్తి చేశారు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ లో వైద్యురాలిని అతి కిరాతకంగా హతమార్చిన నిందితుడికి జైలులో సాధారణ ఖైదీలతో కలిసి జీవించే హక్కు లేదన్నారు. కనీసం ఇప్పటి నుంచైనా మహిళ వైద్యులకు రక్షణ కల్పించి , చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరారు. ఈ ఘటనలో తెర వెనుక ఉన్న దోషుల గుర్తించి , కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.