ఓయూలో ధర్నాలు, నిరసనలు నిషేధం :సర్క్యులర్ ​జారీ చేసిన వర్సిటీ అధికారులు 

ఓయూలో ధర్నాలు, నిరసనలు నిషేధం :సర్క్యులర్ ​జారీ చేసిన వర్సిటీ అధికారులు 

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు, నినాదాలను నిషేధిస్తూ అధికారులు సర్క్యులర్​జారీ చేశారు. వర్సిటీ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా సర్క్యులర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్​ఆర్ఎస్ వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య డిమాండ్​చేశారు. నినాదాలు కూడా నిషేధితమని సర్క్యులర్ ఇచ్చిన ఏకైక నియంతృత్వ ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అని విమర్శించారు.

తాజా సర్క్యులర్​పై ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, విశ్వేశ్వరరావు, తెలంగాణ మేధావులు స్పందించాలని కోరారు. వర్సిటీ సర్క్యులర్​ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఏబీవీపీ నగర కార్యదర్శి పృథ్వీతేజ తెలిపారు. ప్రశ్నించే హక్కును వర్సిటీ అధికారులు హరిస్తున్నారన్నారు.