ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం

ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం
  • ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీల్లో ఆన్ లైన్ తరగతులే
  •  టీచింగ్.. నాన్ టీచింగ్ సిబ్బంది హాజరుకావాల్సిందే

హైదరాబాద్:  కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపట్నుంచి ప్రారంభం కావాల్సిన ప్రత్యక్ష తరగతులను వాయిదా వేసింది. రేపటి నుంచి ఈనెల 12వ తేదీ వరకు ఆన్ లైన్ క్లాసులే నిర్వహించాలని నిర్ణయించింది. యూనివర్సిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీల్లో ఆన్ లైన్ తరగతులే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. 

యూనివర్సిటీ పరిధిలో పీజీ, యూజీ కోర్సుల సెమిస్టర్ తరగతులను ఆన్ లైన్ లోనే నిర్వహించాలని ప్రిన్సిపల్స్, ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో తీర్మానం చేశారు. కాలేజీలలో పనిచేసే టీచింగ్.. నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కాలేజీలకు హాజరై ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహించాలని సమావేశంలో సూచించారు.  

 

ఇవి కూడా చదవండి

AP:రిటైర్మెంట్ 62 ఏళ్లు.. గవర్నర్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు

ములాయం కాళ్లు మొక్కిన స్మృతి ఇరానీ