అన్నంలో పురుగులు వస్తున్నయి .. ఓయూలో మానేరు హాస్టల్విద్యార్థుల ఆందోళన

సికింద్రాబాద్, వెలుగు: ఓయూలో మానేరు హాస్టల్ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. ఆర్ట్స్​కాలేజీ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, నీళ్ల చారు పెడుతున్నారని ఆరోపించారు. హాస్టల్​లో అనేక సమస్యలు ఉన్నాయని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. 

హాస్టల్​లో​ నీటి సమస్య తీవ్రంగా ఉందని, తాగడానికి  మంచి నీళ్లు కూడా లేవన్నారు. స్పందించిన అధికారులు సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.