హైదరాబాద్: సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న భార్యాభర్తలను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియాతో ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావు మాట్లాడుతూ.. పడుకొని ఉన్నవారి దగ్గర నుంచి సెల్ ఫోన్లు దొంగిలిస్తున్న రెండు ముఠాలను పట్టుకున్నాము.. అందులో ఒక ముఠా నాయకుడు అరుణ్ కుమార్, అతని భార్య స్నేహతో కలిసి రాత్రి వేళలో తిరుగుతూ క్యాంపస్ పరిసరాల్లో నిద్రిస్తున్న వారి దగ్గర నుండి సెల్ ఫోన్లు దొంగలిస్తూ వారి అవసరాలకు డబ్బులకు అమ్మేసుకుంటున్నారు.
అరుణ్ పై గతంలో 6 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. అరుణ్ వద్ద 6 సెల్ ఫోన్లు, 2ద్విచక్రవాహాలను స్వాధీనం చేసుకున్నారు. రెండో ముఠా నాయకుడు శ్యాంసన్ కూడా నిద్రిస్తున్న వారి దగ్గర నుండి సెల్ ఫోన్లు దొంగిలిస్తూ తన అవసరాలకు తీర్చుకుంటున్నాడు. శాంసన్ దగ్గర నుండి 11 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.