పర్వతగిరి(సంగెం)/ ఆత్మకూరు, వెలుగు : పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో మంగళవారం ఇతర పార్టీలో నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్లో చేరారు. హన్మకొండలోని ఆయన నివాసంలో సంగెం మండల ఎంపీపీ కందగట్ల కళావతి పార్టీలో చేరారు. ఆమెతో పాటు రైతు బంధు మండలాధ్యక్షుడు
ఎంపీపీ భర్త నరహరి, మాజీ వైస్ ఎంపీపీ, సంగెం, నల్లబెల్లి ఎంపీటీసీలు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు తదితరులు కాంగ్రెస్లో చేరినట్లు ఎంపీపీ తెలిపారు. ఆత్మకూరు మండల పరిధిలోని పలు గ్రామాల వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే రేవూరి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.