టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అదేశంతో టీటీడీ లో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభించారు. టీటీడీ ఉద్యోగులుగా ఉంటూ ఇతర మతాలకు సంబంధించిన ఆచారాలను.. సంప్రదాయాలను పాటిస్తున్న 18 మంది టీటీడీ ఉద్యోగులను తొలగించారు.
టీడీడీ బోర్డు గత ఏడాది నవంబర్ 18న నిర్ణయించిన తీర్మానం ప్రకారం.. ఎండోమెంట్ యాక్ట్ 1060, 1989 ప్రకారం హిందూమత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొంది తరువాత అన్యమతాన్ని ప్రోత్సహిస్తూ ... హిందూ భక్తుల మనోభావాలను.. టీటీడీ పవిత్రతను కొంతమంది ఉద్యోగస్తులు దెబ్బతీస్తున్నారు.
Also Read :- తిరుమల కొండపై యహోవా కారు
ఇతర మతాలకు సంబంధించిర కార్యక్రమాల్లో పాల్గొంటూనే... టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. 18 మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల, టీటీడీ అనుబంధ ఆలయాల్లో, ఆలయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నట్లయితే వెంటనే ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. సదరు ఉద్యోగులు టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని ఆదేశాలు జారీ చేశారు. అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ లేదా విఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలని టీటీడీ బోర్డు తీర్మానించింది.