
అమెజాన్ ప్రైమ్ కొత్త ప్రయోగం.. ఏఐ తో ఆ సమస్యకి చెక్..
సినిమా సరిహద్దులు, భాషలు లేవు.. అందుకే కంటెంట్ బాగున్న సినిమా ని భాష, దేశంతో సంబంధం లేకుండిన ప్రతీచోట ఆదరిస్తారు.. అయితే కొన్ని కొన్ని సినిమాలు బాగున్నప్పటికీ లోకల్ భాషలో లేకపోవడంతో ఆడియన్స్ నిరాశ చెందుతుంటారు. దీంతో ఈ సమస్యకి చెక్ పెట్టేందుకు ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కొత్త ప్రయోగం చేస్తోంది. ఇందులోభాగంగా లాంగ్వేజ్ సమస్యలకి చెక్ పెట్టేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకుంటోంది.
అయితే కొన్ని హాలీవుడ్ సినిమాలు లాంగ్వేజ్ సమస్య కారణంగా ఇతర భాషల్లో రిలీజ్ కావడం లేదు. అంతేకాకుండా డబ్బింగ్ ఖర్చు, డైలాగుల ట్రాన్సలేషన్ వంటి సమస్యలు కూడా ఉండటంతో కొన్ని స్పానిష్, జపాన్, ఇంగ్లీష్, చైనీస్ తదితర భాషల సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ రీజినల్ లాంగ్వేజస్ లో రిలీజ్ కావడం లేదు.
దీంతో ఏఐ ని ఉపయోగించి డైలాగ్ ట్రాన్సలేషన్, సబ్ టైటిల్స్, వాయిస్ డబ్బింగ్ వంటి సమస్యలకి చెక్ పెట్టబోతున్నారు. అయితే మొదటగా ఈ ప్రయోగాన్ని లాటిన్ అమెరికన్ స్పానిష్ భాషలలో చేస్తుండగా భవిష్యత్తులో మరిన్ని భాషలు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇందులో మొదటగా ఏఐ ద్వారా డబ్బింగ్ చెప్పి ఆ తర్వాత ఎడిటర్స్ సహాయంతో డైలాగులు, క్యాప్షన్స్ వంటివి పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేట్లు ఎడిట్ చేస్తారు. ఆ తర్వాత ఎక్స్పర్ట్ ప్రివ్యూ చూసిన తర్వాత ఫైనల్ ప్రింట్ ఓటీటీలో రిలీజ్ చేస్తారు. దీంతో డబ్బింగ్ ఖర్చుతోపాటూ, డైలాగ్ ట్రాన్సలేషన్ ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఇతర దేశాల సినిమాలు కూడా లోకల్ భాషలలో రిలీజ్ చేయడంవలన మేకర్స్ కి మంచి లాభం చేకూరుతుందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.