ఆడియన్స్ గెట్ రెడీ.. ఈవారం OTTకి వస్తున్న క్రేజీ సినిమాలివే!

ఆడియన్స్ గెట్ రెడీ.. ఈవారం OTTకి వస్తున్న క్రేజీ సినిమాలివే!

సినిమాలంటే ఒకప్పుడు థియేటర్స్ మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు OTTలు కూడా వచ్చేశాయి. ప్రతీవారం కొత్త కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఓటీటీ కంటెంట్ కోసం ఈగర్ గానే వెయిట్ చేస్తున్నారు. అందులో భాగంగానే వారికి సరికొత్త ఎంటర్టైన్మెంట్ పంచేందుకు ఈవారం కూడా సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి ఓటీటీ సంస్థలు. వాటిలో థియేటర్ రన్ ముగించుకొని ఓటీటీకి వస్తున్న సినిమాలు కొన్నైతే.. డైరెక్ట్ ఓటీటీకి వస్తున్న సినిమాలు కొన్ని. 

ఇక ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలో క్రేజీ సినిమాలున్నాయి. వాటిలో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సైంధవ్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో వస్తున్న మిస్ పర్ఫెక్ట్, ఓహ్ మై డార్లింగ్ వంటి సూపర్ హిట్ సినిమాలున్నాయి. మరి ఏ ఏ సినిమా ఏ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అనే డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్:
జనవరి 29: మరిచి (కన్నడ సినిమా)
ఫిబ్రవరి 02: సైంధవ్ (తెలుగు సినిమా రూమర్ డేట్), డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్), మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లీష్ సిరీస్)

హాట్‌స్టార్:
జనవరి 31: కోయిర్ (ఇంగ్లీష్ సిరీస్)
ఫిబ్రవరి 02: మిస్ ఫెర్‌ఫెక్ట్ (తెలుగు సిరీస్), సెల్ఫ్ (ఇంగ్లీష్ సినిమా)

నెట్‌ఫ్లిక్స్:
జనవరి 29: మైటీ భీమ్స్ ప్లే టైమ్ (ఇంగ్లీష్ సిరీస్), ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ సినిమా),
జనవరి 30: జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (ఇంగ్లీష్ చిత్రం), నాస్కర్: ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్ సిరీస్)
జనవరి 31: అలెగ్జాండర్: ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (ఇంగ్లీష్ సిరీస్), బేబీ బండిటో (ఇంగ్లీష్ సిరీస్),ద సెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్ సిరీస్),WIL (డచ్ సినిమా)
ఫిబ్రవరి 01: ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ మూవీ)
ఫిబ్రవరి 02: లెట్స్ టాక్ అబౌట్ CHU (మాండరిన్ సిరీస్), ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్ సినిమా)

బుక్ మై షో;
జనవరి 30: అసెడియో (స్పానిష్ సినిమా)

జియో సినిమా:
జనవరి 29: ఇన్ ద నో (ఇంగ్లీష్ సిరీస్)

మనోరమ మ్యాక్స్:
ఫిబ్రవరి 02: ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా)