OTT Movies: 2025 జనవరి ఫస్ట్ వీక్లో.. ఓటీటీల్లోకి రానున్న టాప్-5 సినిమాలివే

OTT Movies: 2025 జనవరి ఫస్ట్ వీక్లో.. ఓటీటీల్లోకి రానున్న టాప్-5 సినిమాలివే

గతేడాది (2024) పలు భాషల ఓటీటీ మూవీస్ తో సినీ ప్రేక్షకులు బాగా ఎంటర్ టైన్ అయ్యారు. విభిన్న కథలతో సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చి ఆడియన్స్ కి థ్రిల్ ఇచ్చాయి. మరి ఈ ఏడాది (2025 )కూడా అంతకు మించి అనేలా రాబోతున్నాయి. అయితే, ముందుగా ఈ వారం రానున్న క్రేజీ సినిమాలు ఏంటనేవి ఓ లుక్కేద్దాం.

కొత్త ఏడాది 2025 జనవరి తొలి వారంలో ఓ తెలుగు సినిమా డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కి రానుంది. ఫ్యామిలీ, కామెడీ, డ్రామా, క్రైమ్ వంటి  వివిధ జానర్స్ నుంచి టాప్ 5 సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. 

కథా కమామిషు:

టాలీవుడ్ నటి ఇంద్రజ, పలాస, మట్కా సినిమాల డైరెక్టర్ కరుణ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ కథా కామానుషీ. ఈ మూవీని ఇద్దరు డైరెక్టర్స్ గౌతమ్ - కార్తీక్ తెరకెక్కించారు. కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ నేడు గురువారం (జనవరి 2) నుంచి ఆహా ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ కి వచ్చింది. కొత్తగా పెళ్లయిన నాలుగు జంటల ఫస్ట్ నైట్ తిప్పల చుట్టూ మూవీని రూపొందించారు. ఇందులో వెంక‌టేష్ కాకుమాను, మెయిన్ మ‌హ‌మ్మ‌ద్‌, హ‌ర్షిని ఇత‌ర పాత్ర‌ల్లో క‌నిపించారు.

ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌:

'ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌..'(All We Imagine as Light) దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ఇది. అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో అవార్డులతో పాటుగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రమిది. అంతేకాదు..అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 2024 లో తన ఫేవరేట్ మూవీస్ లిస్ట్ లో ఒకటిగా నిలిచిన మూవీ కూడా. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. రేపు శుక్రవారం (జనవరి 3న) డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

కని కుశ్రుతి, దివ్య ప్రభ,ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ఏడాది నవంబర్ 22న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణతో పాటు వసూళ్లు కూడా సొంతం చేసుకుంది.

కథేంటంటే:

ముంబైలో రోజువారీ జీవనం కోసం కష్టపడుతున్న ముగ్గురు మహిళల కథ. ముంబయి ఓ నర్సింగ్ హోంలో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సులు, మరియు పార్వతి అనే వంటమ్మాయి కథే ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’. అయితే ఆ నర్సులిద్దరు కలిసి ఓ బీచ్ టౌన్ కు రోడ్ ట్రిప్ వెళ్తారు. ఆ తర్వాత వారిద్దరి జీవితాలు ఎలా మారాయి.. ? అన్నదే ఈ సినిమా స్టోరీ. ఇకపోతే తెలుగులో ఈ మూవీని రానా రిలీజ్ చేశారు.

లవ్ రెడ్డి:

అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా స్మరన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ రెడ్డి’. హేమలత రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప కలిసి నిర్మించారు. ఈ మూవీ శుక్రవారం (జనవరి 3న) ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కి రానుంది. 2024 అక్టోబర్ 18న థియేటర్స్లో రిలీజయింది. రాయలసీమ బ్యాక్‍డ్రాప్‍లో లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ మూవీ రూపొందిందింది. 

కడకన్ మూవీ:

సజిల్ మంపాడ్ దర్శకత్వం వహించిన మలయాళ యాక్షన్ చిత్రం కడకన్. ఈ చిత్రంలో హక్కిం షా ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ సన్‍నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రేపు (జనవరి 3) నుంచి స్ట్రీమింగ్ కి రానుంది. గతేడాది 2024 మార్చిలో ఈ మూవీ థియేటర్స్ లో రిలీజై ఆడియెన్స్‌తో పాటు క్రిటిక్స్‌ను మెప్పించింది. ఇసుక మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో వచ్చి ఆడియన్స్ కి మంచి థ్రిల్ ఇచ్చింది. 

కథేంటంటే::

నీలంబూర్ ఏరియాలో ఇసుక మాఫియా ఘోరంగా  జరుగుతోంది. అక్కడే ఉన్న గ్యాంగ్స్ లీడ‌ర్స్ మ‌ణి, సుల్ఫీ స్నేహం కాస్త శత్రుత్వంగా  మారుతుంది. ఇసుక అక్ర‌మ ర‌వాణా కార‌ణంగా ఏర్పడిన వీరి మధ్య పగ అది మరింత దూరం వెళుతోంది. ఇందులో సుల్ఫీ అనే వ్యక్తి  ల‌క్ష్మి అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ కోసం మాఫియా బిజినెస్‌కు దూరంగా వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. అనుకోకుండా సుల్ఫీ లోక‌ల్ సీఐ రంజిత్‌తో గొడ‌వ‌ప‌డ‌తాడు.

మ‌ణితో చేతులు క‌లిపిన రంజిత్ సుల్ఫీని దెబ్బ తీసేందుకు కుట్ర‌లు ప‌న్నుతాడు. సుల్ఫీని అరెస్ట్ చేయాల‌ని అనుకుంటాడు. రంజిత్‌, మ‌ణి ప్లాన్స్‌ను సుల్ఫీ ఎలా ఎదుర్కొన్నాడు? ఇసుక మాఫియా అక్ర‌మ దందాను వ‌దిలిపెడ‌తాన‌ని ప్రియురాలికి ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నాడా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ట్రాప్:

హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘ట్రాప్’ ఓటీటీలోకి వచ్చింది. ఇవాళ జనవరి 2న జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే కొన్ని ఓటీటీల్లో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే, ఇప్పుడు జియోసినిమా ఓటీటీలో రెంట్ లేకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్‍లో అందుబాటులోకి వచ్చింది.

ఈ మూవీలో జోష్ హార్ట్‌నెట్‍ ప్రధానపాత్రలో నటించారు నటించారు. నైట్ ష్యామలాన్ దర్శకత్వం వహించారు.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సుమారు 82 మిలియన్ డాలర్ల (సుమారు రూ.703కోట్ల) కలెక్షన్లు సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. వరుస హత్యల నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది.

గునా సీజన్ 2:

గునా S2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిల్ సీనియర్ దర్శకత్వం వహించిన రెండవ సీజన్‌లో దర్శన్ పాండ్యా మరియు శశాంక్ కేత్కర్ కూడా ఉన్నారు. మరిన్ని ట్విస్టులతో, ఊహించని నాటకీయ క్షణాలతో ఉంటుందని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఈ సిరీస్ జనవరి 3న డిస్నీ+ హాట్‌స్టార్‌లోస్ట్రీమింగ్ కానుంది.

లాకర్బీ: సత్యం కోసం ఒక శోధన:

1988 నాటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా లాకర్బీ: ఎ సెర్చ్ ఫర్ ట్రూత్‌ రూపొందింది. జిమ్ స్వైర్‌గా కోలిన్ ఫిర్త్ మరియు జేన్ స్వైర్ పాత్రలో కేథరీన్ మెక్‌కార్మాక్ ముఖ్య పాత్రల్లో నటించారు. రేపు జనవరి 3న జియో సినిమాలో స్ట్రీమింగ్ కి వస్తోంది.

కథేంటంటే::

ఈ మూవీ కథ జిమ్ స్వైర్ చుట్టూ తిరుగుతుంది. ఒక తండ్రి తన కుమార్తె ఫ్లోరా పాన్ యామ్ ఫ్లైట్ 103లో మరణించిన తర్వాత న్యాయం కోసం చేసే అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కింది.