OTT Movies: ఓటీటీకి వచ్చిన కొత్త సినిమాలు..3 మాత్రమే చాలా స్పెషల్.. ఎక్కడ చూడాలంటే?

OTT Movies: ఓటీటీకి వచ్చిన కొత్త సినిమాలు..3 మాత్రమే చాలా స్పెషల్.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీల్లో ప్రతివారం కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ వారం (ఏప్రిల్ 24, 25 తేదీల్లో) తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సూపర్ హిట్గా నిలిచిన సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. 

అందులో యాక్షన్ డ్రామా, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన సినిమాలున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలు, 2025 ఏడాదిలోనే వచ్చి థియేటర్ ఆడియన్స్ని మెప్పించాయి. అందులో ఒకటి మన తెలుగు సినిమా కావడం విశేషం. మరి ఆ సినిమాలేంటీ? అవి ఎక్కడ స్ట్రీమింగ్కి వచ్చాయో ఓ లుక్కేద్దాం. 

మ్యాడ్ స్క్వేర్:

సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మ్యాడ్ స్క్వేర్ (Mad Square). గతంలో చిన్న సినిమాగా రిలీజై సంచలనం సృష్టించిన మ్యాడ్ సినిమాకు ఇది సీక్వెల్. 2025 మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.

థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ తెలుగు సినిమా ఇవాళ (ఏప్రిల్ 25న) ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ వంటి ఐదు భాషల్లో అందుబాటులో ఉంది. 

మ్యాడ్ స్క్వేర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.77కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక చిత్రంలో సునీల్, ప్రియాంక జువాల్కర్, డైరెక్టర్ అనుదీప్ ముఖ్యపాత్రల్లో నటించారు.

వీర ధీర శూర పార్ట్ 2:

తమిళ్ యాక్టర్ విక్రమ్ హీరోగా నటించిన యాక్షన్ మూవీ "వీర ధీర శూర పార్ట్ 2". 2025 మార్చ్ 27న పాన్ ఇండియా లెవెల్లో రిలీజైన ఈ సినిమాకి థియేటర్స్ లో మొదట మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. తర్వాత విక్రమ్ నటన, యాక్షన్ ఎపిసోడ్స్ ఫాన్స్ కి నచ్చేలా ఉండటంతో జస్ట్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా ఏప్రిల్ 24న ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, కన్న, హిందీ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. రూ.55 కోట్ల బడ్జెట్ తో తెరెకెక్కిన వీర ధీర శూర పార్ట్ 2.. ఫైనల్ రన్ లో వరల్డ్ వైడ్ గా రూ.62 కోట్ల వరుకు కలెక్షన్స్ సాధించింది. ఈ చిత్రం లో దుస్సార విజయన్ హీరోయిన్ గా నటించింది. SJ సూర్య కీలక పాత్రలో నటించారు. 

L2 ఎంపురాన్: 

మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ L2 ఎంపురాన్. 2025 మార్చి 27న పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజయ్యింది. మలయాళంలో హయ్యెస్ట్ గ్రాస్ వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు నెలకొల్పింది.

ఈ మూవీ ఏప్రిల్ 24న జియో హాట్ స్టార్‌‌లో అందుబాటులోకి వచ్చింది. మలయాళం, తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలలో ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతుంది. ఈ మూవీలో అభిమన్యు సింగ్, మంజు వారియర్ కీలక పాత్ర పోషించారు.