OTT Crime Thrillers: ఉత్కంఠరేపే టాప్ 3 తమిళ వెబ్ సిరీస్‍లు.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

OTT Crime Thrillers: ఉత్కంఠరేపే టాప్ 3 తమిళ వెబ్ సిరీస్‍లు.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ మార్కెట్లో ఓటీటీ(OTT)ల హవా నడుస్తోంది. ఆడియన్స్ కూడా కొత్త కొత్త కంటెంట్ కోసం ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. ఓటీటీ సంస్థలు కూడా వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కంటెంట్ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

మరీ ముఖ్యంగా ఓటీటీలు వెబ్ సిరీస్లు అనగానే లవ్ అండ్ ఎమోషనల్ కాకండా హారర్, క్రైమ్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ సిరీస్ లపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అందుకే ఈ మధ్య మేకర్స్ కూడా ఇలాంటి కంటెంట్ ను ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొన్ని సిరీస్‍లకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ ఉంది. అందులో ఓ మూడు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు 202 2025లో వచ్చి అలరిస్తున్నాయి. మరి ఆ సినిమాలేంటీ? వాటి కథేంటీ? అనేది చూద్దాం.

ఇన్స్పెక్టర్ రిషి (Inspector Rishi):

నటుడు నవీన్ చంద్ర(Naveen Chandra) ప్రధాన పాత్రలో వచ్చిన.. ఈ హారర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను దర్శకురాలు జేఎస్ నందిని (JS Nandini) తెరకెక్కించారు. 2024 మార్చి 29న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తం పది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ 30 నుంచి 60 నిమిషాల మధ్యలో ఉంది. క్షణక్షణం హారర్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సాగిన ఈ సిరీస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. 

కథేంటంటే:

తింకాడు అనే అటవీ ప్రాంతంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అదే అడవిలో సంచరించే రాట్చి అనే దెయ్యమే ఈ హత్యలు చేస్తుందని ఆ ఊరి జనం నమ్ముతారు. అత్యంత భయానకంగా జరిగే ఈ వరుస హత్యల కేసు ఇన్వెస్టిగేషన్ సీబీ సీఐడీ చేతికి వెళ్తుంది. అందులో భాగంగానే ఆ ఊరికి కొత్తగా ఇన్‏స్పెక్టర్ రిషి వచ్చి కేసు విచారణ మొదలుపెడతాడు.

►ALSO READ | TheRajasaab: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ క్రేజీ అప్డేట్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?

మరి ఇన్‏స్పెక్టర్ రిషి విచారణ ఎలా జరిగింది? ఆ విచారణలో రిషి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు? నిజంగా ఆ హత్యలకు కారణం ఆ దెయ్యమేనా? అనే విషయాలను ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఇందులో సునైనా, కన్న రవి కూడా కీరోల్స్ చేశారు. ఈ సిరీస్ తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ డబ్బింగ్‍లోనూ అందుబాటులో ఉంది.

స్నేక్స్ అండ్ లాడర్స్ (Snakes & Ladders):

ఇండియాలో వైకుంఠ పాళి (స్నేక్స్​ అండ్​ ల్యాడర్స్) గేమ్​ చాలా ఫేమస్​. 1980, 90ల్లో పిల్లలు ఈ గేమ్​ ఎక్కువగా ఆడేవాళ్లు. ఇందులో అదృష్టం ఉంటే నిచ్చెనలు ఎక్కుతారు. లేదంటే పాములకు బలవుతారు. ఈ కథ కూడా ఆ గేమ్​కు దగ్గరగా ఉండడం వల్ల ఆ టైటిల్​ పెట్టారు. 2024 చివర్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చింది. 

ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍లో సమ్రిత్, సూర్య రాఘవేశ్వర్, సూర్య కుమార్, తరుణ్ యువరాజ్, సాషా భరేన్, నవీన్ చంద్ర, నందా, మనోజ్ భారతిరాజా నటించారు. భరత్ మురళీధరన్, అశోక్ వీరపన్, కమలా ఆల్కెమిస్ డైరెక్ట్ చేశారు. ఇది డైరెక్ట్ తమిళంలో తెరకెక్కగా.. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల డబ్బింగ్‍లోనూ అందుబాటులో ఉంది.

కథేంటంటే:

రెట్టముగాడు అనే హిల్ స్టేషన్(కల్పిత)​లో 2006లో జరిగిన కథ ఇది. గిల్బర్ట్ అలియాస్​ గిల్​ (సమ్రిత్), ఇరైయన్ (సూర్య రాఘవేశ్వర్), శాండీ (సూర్య కుమార్), బాల (తరుణ్ యువరాజ్) మంచి ఫ్రెండ్స్​. వీళ్లందరికీ వ్యక్తిగత జీవితాల్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. గిలీ కొన్నేళ్లుగా తన తల్లిదండ్రులను చూడలేదు. శాండీ తండ్రి ఎప్పుడూ ఇంట్లో ఉండడు. ఒకరోజు కొందరు దొంగలు అదే ఊళ్లో ఉన్న మ్యూజియంలోని విలువైన లాకెట్​ని చోరీ చేస్తారు. తర్వాత ఈ నలుగురికీ కామన్​ ఫ్రెండ్​ అయిన రాగి ఇంటికి వెళ్తారు. అక్కడ రాగి వాళ్ల అమ్మ మీద దాడి చేసి.. తర్వాత గిలీ ఇంట్లోకి చొరబడతారు. 

బ్లేడ్​ అనే దొంగ గిలీ ఇంట్లోని వంటగది అల్మరాలో దాక్కుంటాడు. అది గమనించిన గిలీ తన అమ్మమ్మను కాపాడుకోవడానికి దానికి తాళం వేస్తాడు. బ్లేడ్​కి ఉబ్బసం ఉంటుంది. అల్మరాలో చిక్కుకోవడం వల్ల ఊపిరాడక అందులోనే చనిపోతాడు. దాంతో గిలీ హంతకుడు అవుతాడు. గిలీ, అతని నలుగురు ఫ్రెండ్స్​ కలిసి శవాన్ని మాయం చేస్తే హత్య కేసు నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటారు. అందుకోసం వాళ్లు ఎలాంటి ప్రయత్నాలు చేశారు?​ లాకెట్‌‌‌‌‌‌‌‌ తీసుకుని బ్లేడ్ తన స్థావరానికి తిరిగి వెళ్లకపోవడంతో ఆ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ ఏం చేశాడు అనేదే ఈ వెబ్​సిరీస్​. 

సుడల్‌: ది వొర్టెక్స్‌ (Suzhal The Vortex):

వాల్‍వాచర్స్ ఫిల్మ్స్ పతాకం ఈ సిరీస్‍ను నిర్మించింది. దర్శక ద్వయం పుష్కర్ - గాయత్రి  తెరకెక్కించారు. ఈ వెబ్‌సిరీస్‌లో ఐశ్వర్య రాజేశ్, గోపిక రమేష్, కథిర్, ఆర్. పార్థిబన్, శ్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించగా బ్రహ్మ జి, అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించారు.

2022లో విడుదలైన తమిళ వెబ్‌సిరీస్‌ ఇది. తెలుగులో డబ్ అయి గ్రాండ్ సక్సెస్ అయింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్‌ దర్శకుడు రాజ‌మౌళి, హృతిక్‌రోష‌న్‌, ధ‌నుష్‌తో పాటు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల ప్ర‌శంస‌ల్ని అందుకుంది.

సుడ‌ల్ సీజన్ 2 ఫిబ్రవరి 28,2025 న స్ట్రీమింగ్కి వచ్చింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. మర్డర్ మిస్టరీల చుట్టూ ఈ సిరీస్‍ను గ్రిప్పింగ్ నరేషన్, ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ సిరీస్ రూపొందించారు.