
ఏప్రిల్ నెలలో పలు ఇండస్ట్రీల నుంచి కొత్త సినిమాలు ఓటీటీల్లో సందడి చేశాయి. 2025 ఫిబ్రవరి, మార్చి నెలలో రిలీజైన కొత్త సినిమాలు కూడా ఒక నెల వ్యవధిలోనే ఓటీటీకి వచ్చి ప్రేక్షకులను అలరించాయి. అందులో చాలా వరకు థియేటర్స్లో ఆడియన్స్ను మెప్పించిన సినిమాలే ఉండటం విశేషం.
ఈ క్రమంలో మే నెలలో రాబోయే సినిమాల కోసం, ఓటీటీ ఆడియన్స్ ఓ లుక్కేస్తున్నారు. మరి మేలో రానున్న ఓ 4 ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలేంటో తెలుసుకుందాం. అయితే, ఈ 4 సినిమాలు భారీ అంచనాలతో వచ్చి, బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్ని కూడా అందుకోలేకపోయాయి. ఇపుడు వాటి గురించి మాట్లాడుకుందాం. మరి ఆ సినిమాలేంటో.. అవెక్కడ స్ట్రీమింగ్ కి రానున్నాయో చూద్దాం.
జాక్ ఓటీటీ:
‘టిల్లు స్క్వేర్’ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన మూవీ ‘జాక్’(JACK). బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. సిద్ధుకి జంటగా వైష్ణవి చైతన్య నటించింది. 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్గా నిలిచింది. స్పై యాక్షన్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్ ఆడియన్స్ను మెప్పించలేకపోయింది.
ఈ క్రమంలో జాక్ మూవీ నెల తిరగకుండానే ఓటీటీలోకి రాబోతుందని సమాచారం. ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. అన్నికుదిరితే మే ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో వచ్చే ఛాన్స్ ఉంది. త్వరలోనే జాక్ స్ట్రీమింగ్ డేట్ని మేకర్స్ ప్రకటించే ఛాన్స్ ఉంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.
రాబిన్‍హుడ్ ఓటీటీ:
నితిన్, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్‍హుడ్ (Robinhood).కామెడీ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీని వెంకీ కుడుముల తెరకెక్కించాడు. 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది. ఈ క్రమంలో రాబిన్‍హుడ్ ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమైంది.
►ALSO READ | HIT3: మనల్ని ఎవడ్రా ఆపేది.. ప్రామిస్ చేస్తున్నా..హిట్ కన్ఫార్మ్: నాని
రాబిన్‍హుడ్ ఓటీటీ హక్కులను Zee5 ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానల్ సొంతం దక్కించుకుంది. నితిన్ కెరీర్లో భారీ బడ్జెట్తో వచ్చిన మూవీ కావడంతో డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులు మంచి ధరకు అమ్ముడయ్యాయి.
ఇప్పుడీ మూవీ ఓటీటీలో, టీవీలో ఒకే రోజు స్ట్రీమింగ్ కాబోతుంది. వచ్చే నెల మే 5న జీ5 ఓటీటీతో పాటు జీ తెలుగు ఛానల్లో ఈ మూవీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. త్వరలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఓదెల2 ఓటీటీ:
తమన్నా లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘ఓదెల 2’ (Odela 2). దర్శకుడు సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ రూపొందించాడు. డి మధు నిర్మించారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం కొన్నిచోట్ల థియేటర్ లో రన్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్నే చవిచూస్తోంది. మేకర్స్ ఆశించినంత విజయాన్ని అందుకోవడంలో కష్టపడుతుంది.
ఈ క్రమంలో ఓదెల 2 మే నెలలోనే ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుంది. ప్రైమ్ వీడియో దాదాపు రూ.18 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ మే నెల చివరి రెండో వారంలో ఓటీటీకి వచ్చే అవకాశం ఉంది.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓటీటీ:
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun S/O Vyjayanthi). కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి కీలక పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ మూవీ కూడా మే నెలలోనే ఓటీటీకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే, ఈ సినిమా ఓటీటీ హక్కులను ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ దక్కించుకుందో మాత్రం వివరాలు బయటకి రాలేదు.