![OTT Malayalam Movies: ఓటీటీకి వస్తున్న టాప్ 3 మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?](https://static.v6velugu.com/uploads/2025/02/ott-top-4-malayalam-movies-in-february-10-to-16_rYicvSOzQR.jpg)
ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ కు మలయాళ సినిమాలు తెగ నచ్చేస్తున్నాయి. అక్కడీ మేకర్స్ తీసే సినిమాలకి మన వాళ్ళు ఫిదా అవుతున్నారు. ఎంతలా అంటే కాచుకుని కూర్చునేలా ఉన్నారు. అందులో ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామా, క్రైమ్, థ్రిల్లర్స్ ఉన్నాయంటే మన తెలుగువారికి పండుగనే చెప్పుకోవాలి. అంతలా ఆసక్తిగా ఉంటాయి అక్కడి సినిమాలు.
ఈ వారం (ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16) మధ్య ఓటీటీకి ఓ మూడు ఇంట్రెస్టింగ్ మలయాళ సినిమాలు, ఓ వెబ్ సిరీస్ రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటీ? వాటి జోనర్స్ ఏంటనేది ఓ లుక్కేద్దాం.
మార్కో:
మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మార్కో. డిసెంబర్ 20న రిలీజైన ఈ మూవీ 2024 డిసెంబర్ చివర్లో మలయాళంలో సూపర్ హిట్ అయింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. న్యూ ఇయర్ స్పెషల్గా జనవరి 1న తెలుగులో రిలీజై అదరగొట్టింది.
ALSO READ | BoycottLaila: సారీ చెప్పేదే లేదు.. దమ్ముంటే లైలా మూవీని ఆపుకోండి : వైసీపీకి పృథ్వీ రివేంజ్ సవాల్
ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు నుంచి మంచి ఆదరణ వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన విజువల్స్కి బాగా కనెక్ట్ అయ్యారు. ఇందులో ఉన్న యాక్షన్స్ కేజీఎఫ్, యానిమల్, కిల్ సినిమాలని మించి తలపించాయి. ఈ మూవీ ఓటీటీ హక్కులను భారీ ధరకు సోనీ లివ్ దక్కించుకుంది. ఫిబ్రవరి 14 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఒరి కాట్టిల్ ఒరి మురి:
షానవాస్ కె బావకుట్టి తెరకెక్కించిన మూవీ ఒరి కాట్టిల్ ఒరి మురి. థియేటర్లలో రిలీజైన సుమారు ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చింది. రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో రోపొందించాడు డైరెక్టర్. మనోరమ మ్యాక్స్ లో సోమవారం (ఫిబ్రవరి 10) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
మనోరాజ్యం:
మనోరాజ్యం మూవీ 2024 ఆగస్టులో విడులైంది. ఈ సినిమాకు రషీద్ పరక్కల్ రచన మరియు దర్శకత్వం వహించాడు. గోవింద్ పద్మసూర్య ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో హీరో ఆస్ట్రేలియాలో నివసిస్తున్నప్పటికీ నిజమైన మలయాళీగా ఉండటానికి ప్రయత్నించే వాడిగా కనిపించాడు.
ఈ ఫ్యామిలీ డ్రామా ఓ మలయాళీని పెళ్లి చేసుకున్న ఓ మెల్‌బోర్న్ వ్యాపారవేత్త చుట్టూ తిరుగుతోంది. తన భార్యకు కన్యత్వ పరీక్షలు చేయించే అతని జీవితం పూర్తిగా మలుపు తిరుగుతుంది.
అతడు మళ్లీ తన జీవితాన్ని గాడిలో పెట్టుకోగలడా లేదా అన్నది ఈ సినిమా ప్రధాన కథ. మనోరాజ్యం మూవీని ఇండిజీనియస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సికె అనాస్ మోన్ నిర్మించారు. ఈ సినిమా పూర్తిగా ఆస్ట్రేలియాలోనే చిత్రీకరించబడింది.
కాదలిక్క నేరమిల్లై:
నటుడు జయం రవి హీరోగా రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ కాదలిక్క నేరమిల్లై. ఇది తమిళ సినిమా. కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నటి నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించింది. యోగి బాబు, వినయ్ రాయ్, జాన్ కొక్కెన్ కీలక పాత్రలు పోషించారు.
ఈ మూవీ జనవరి 14 థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ తమిళ చిత్రంగా నిలిచింది. నేడు ఫిబ్రవరి 11, మంగళవారం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కి వచ్చింది.