హాలియా, వెలుగు : నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు పీహెచ్‌డీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. నల్గొండ జిల్లా అనుముల మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన బానావత్ బాలు నాయక్ వ్యాయామ విద్యలో ‘హిస్టారికల్ పర్సిటీ పర్సెప్టిప్ డెవలప్‌మెంట్ ఆఫ్ ప్రో కబడ్డీ ఏ స్టడీ’ అంశంపై ఓయూ ప్రొఫెసర్ వి. సత్యనారాయణ పర్యవేక్షణలో పీఎచ్డీని పూర్తి చేశారు.
ఇతని చెల్లెలు బానావత్ శారద హిస్టరీ విభాగంలో ‘ములుగు జిల్లాలోని గిరిజనుల సామాజిక, ఆర్థిక పరిస్థితుల మార్పు’ అంశంపై ప్రొఫెసర్ అంజయ్య పర్యవేక్షణలో పీహెచ్డీని పూర్తి చేశారు. వీరిద్దరు రెండు రోజుల కింద వర్సిటీ 83వ స్నాతకోత్సవంలో అడోబ్ సీఈవో శంతస్ నారాయణ, ఓయూ వీసీ డి. రవీందర్ చేతుల మీదుగా పట్టా అందుకున్నారు.