
హన్వాడ,వెలుగు: మహబూబ్ నగర్ జిల్లా మండలం పల్లెమోనికాలనీ గ్రామానికి చెందిన ఎం. రాజలక్ష్మి ఇంగ్లిష్ లిటరేచర్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఓయూ ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ బి.అశోక్ పర్యవేక్షణలో ‘కల్చరల్ నెగోషియేషన్ ఇన్ ది డయాస్పోరిక్ స్పేస్.. ఎ స్టడీ ఆఫ్ ది సెలెక్టెడ్ నావెల్స్ ఆఫ్ ఉమా పరమేశ్వరన్ అండ్ చిత్ర బెనర్జీ దివాకరుని’ అనే అంశంపై ఆమె అధ్యయనం చేశారు. ప్రస్తుతం డాక్టర్ ఎం.రాజలక్ష్మి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఎం.రాజలక్ష్మి డాక్టరేట్ రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.