ఓయూ తొలిదశ (1969) ఉద్యమకారుడు డాక్టర్ ఎం.శ్రీధర్ రెడ్డి కన్నుమూశారు. ఇవాళ మధ్యాహ్నం బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి(STPS) నాయకులు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కన్నా ముందే తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని తట్టి లేపిన వారిలో డాక్టర్ ఎం.శ్రీధర్ రెడ్డి ఒకరు. ఓయూ నుంచే తెలంగాణ ఉద్యమ జ్వాలలు దేశవ్యాప్తంగా ఎగజిమ్మిన ఉద్యమనేతగా ఆయనకు పేరుంది.
మంగళవారం మధ్యాహ్నం12గంటలకి జూబ్లీ హిల్స్ మహాప్రస్థానం లో శ్రీధర్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్ రావు, మలిదశ తెలంగాణ ఉద్యమనేత తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ టీపీసీసీ రాష్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ఆయన సమకాలికులు. శ్రీధర్ రెడ్డి మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటని.. ఆయన నిఖార్సైన తెలంగాణ పోరాట యోధుడని మానవతారాయ్ పేర్కొన్నారు.