ఓయూ హెల్త్​ సెంటర్​కు సుస్తీ !

ఓయూ హెల్త్​ సెంటర్​కు సుస్తీ !
  • కాంట్రాక్ట్ డాక్టర్లు, సిబ్బందితోనే నెట్టుకొస్తున్నరు
  • పర్మినెంట్ డాక్టర్​ రిటైర్డ్ అవడంతో ఖాళీగా పోస్టు 
  • హెల్త్ సెంటర్ లో కనీస సౌకర్యాలు కూడా లేవు

సికింద్రాబాద్, వెలుగు : ఉస్మానియా యూనివర్సిటీలోని హెల్త్ సెంటర్ కు సుస్తీ చేసింది. వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేయగా.. పూర్తిస్థాయి డాక్టర్లు, నర్సులు, స్టాఫ్  లేరు. కనీస సదుపాయాలు కూడా కరువయ్యాయి. రెగ్యులర్ డాక్టర్ గత నెల31న రిటైర్డ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం డాక్టర్ల నుంచి నర్సులు, ఫార్మసిస్టులు, ఆఫీసు సిబ్బంది దాకా అంతా కాంట్రాక్ట్​ సిబ్బందితోనే నడుస్తోంది.

ఐదుగురు  డాక్టర్లు ఉండగా.. నలుగురు కాంట్రాక్టుపైన.. మరొకరు డిపెండెంట్​కింద క్లర్క్​పోస్టులో జాయిన్​ అయి బీడీఎస్​ సర్టిఫికెట్ తో డెంటల్​డాక్టర్​గా వైద్య సేవలు అందిస్తున్నారు. నర్సింగ్​లో మూడు పోస్టులకు ఇద్దరే ఉండగా.. వీరు కాంట్రాక్ట్​ప్రాతిపదినే డ్యూటీలు చేస్తున్నారు. నలుగురు ఫార్మసిస్టులు, ముగ్గురు  ఫిజియోథెరపీస్టులు, ఇద్దరు ల్యాబ్​ టెక్నీషియన్లు కూడా కాంట్రాక్ట్​వారే. ఈసీజీ పోస్టు ఉన్నా ఖాళీగా ఉంది. దీంతో ఈసీజీసేవలు కూడా నర్సింగ్ విభాగమే చూస్తుంది.

డాక్టర్లకు సరైన వేతనాలు ఇవ్వకపోవడంతో ఇక్కడకు కాంట్రాక్ట్​పైన కూడా వచ్చేందుకు  ఇష్టపడడంలేదు. దీంతో ఎమర్జెన్సీ సమయంలో గాంధీ ఆస్పత్రి, తార్నాక ఆర్టీసీ ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వారానికి 3 రోజులు ఆస్పత్రికి రావాల్సిన స్పెషలిస్టు డాక్టర్లు ఒక రోజు మాత్రమే వచ్చిపోతున్నారని విద్యార్థులు పేర్కొంటున్నారు. హెల్త్​సెంటర్​కు ఓయూ రిజిస్ట్రార్​ ఇన్ చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.   దీంతో సెలవు పెట్టాలన్నా రిజిస్ర్టార్​వద్దకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటున్నాయని స్టాఫ్ పేర్కొంటున్నారు.  

మందుల కొను‘గోల్ మాల్’  

 హెల్త్ సెంటర్​లో అందుబాటులో ఉంచే మెడిసిన్ కు వర్సిటీ ఏటా రూ. 40లక్షలు బడ్జెట్​ కేటాయిస్తుంది. ఇందులో 80శాతం నిధులు జెనరిక్​, జీవన్ ధార్ నుంచి, 20 శాతం నిధులతో జనరల్​మెడిసిన్స్​కొంటుంది. లెక్క ప్రకారం చూస్తే రూ.5లక్షలతో  ప్రతి రెండు నెలలకోసారి జనరిక్​, జీవన్​ధార్, ప్రతినెలా రూ.70వేలతో జనరల్​మందులు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచున్నా రు. అయితే మందుల కొనుగోలులో కూడా పెద్ద గోల్​మాల్​జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి.

హెల్త్​సెంటర్​ చీఫ్​మెడికల్​ఆఫీసర్​గా కొనసాగిన డాక్టర్​ గత నెల రిటైర్డ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మందులు కొనుగోలు చేయలేదని తెలిసింది.  నిధులు కూడా విడుదల చేయలేదని హెల్త్ సెంటర్ కు వచ్చే పేషెంట్లు చెపుతున్నారు. ప్రతి బుధ, గురువారం మెడిసిన్ కోసం సెంటర్ కు వచ్చే  పేషెంట్ల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి  హెల్త్ సెంటర్ కు ఒక ఇన్ చార్జిని నియమించాలని, మందుల కొరత లేకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. 

 ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం

ఓయూ హెల్త్ సెంటర్ లో పర్మినెంట్​డాక్టర్లు, సపోర్టింగ్​స్టాఫ్ ను నియమించాలని ప్రభుత్వానికి  నివేదిక ఇచ్చాం. అనుమతి రాగానే భర్తీ చేస్తాం. హెల్త్ సెంటర్​లో త్వరలోనే ఓ సీనియర్​డాక్టర్​ను ఇన్ చార్జిగా నియమిస్తాం. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలుఅందించేందుకు కృషి చేస్తాం.

 ప్రొఫెసర్​ లక్ష్మినారాయణ, ఓయూ రిజిస్ట్రార్

పర్మినెంట్ డాక్టర్లను నియమించాలి

 వర్సిటీ హెల్త్ సెంటర్ లో డాక్టర్, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పర్మినెంట్ డాక్టర్ లేక  కాంట్రాక్ట్ డాక్టర్లతోనే నడుస్తుంది. రాత్రి పూట డాక్టర్లు అందుబాటులో ఉండకపో తుండగా  ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు విద్యార్థులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించా ల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పం దించి వెంటనే పర్మినెంట్ డాక్టర్లను నియమించాలి.

- నెల్లి సత్య, ఓయూ రీసెర్చ్ స్కాలర్