నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు : బాల లక్ష్మి

జనగామ అర్బన్, వెలుగు : నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఓయూ జేఏసీ కన్వీనర్‌‌ బాలలక్ష్మి పిలుపునిచ్చారు. జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జనగామలోని ఎస్‌‌ఆర్‌‌ఆర్‌‌ డిగ్రీ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన రౌండ్‌‌ టేబుల్‌‌ సమావేశంలో రాజకీయ, విద్యార్థి, ప్రజా సంఘాల లీడర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలలక్ష్మి మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని, ప్రజలంతా అండగా ఉంటారన్నారు.

తెలంగాణలో మొదటగా దగా పడ్డది విద్యార్థులే అన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రవళికను అవమానించిన కేటీఆర్‌‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌కు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మంగళంపల్లి రాజు, వెంకట్‌‌రెడ్డి, జెర్రిపోతుల కుమార్, రత్నాకర్‌‌రెడ్డి, రాజశేఖర్, భాస్కర్, తుంగ కౌశిక్, గండి ప్రవీణ్, రాజ్‌‌కుమార్‌‌ పాల్గొన్నారు.