బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్​కు సారీ చెప్పాలి

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్​కు సారీ చెప్పాలి
  • ఓయూ జేఏసీ డిమాండ్

ఓయూ, వెలుగు: అసెంబ్లీలో భూ భారతి బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో స్పీకర్ పై బీఆర్ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాగితాలు విసరడాన్ని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తీవ్రంగా ఖండించింది. కౌశిక్​రెడ్డితోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. కౌశిక్ రెడ్డి చర్యలను ఖండిస్తూ జేఏసీ నాయకులు శనివారం ఆర్ట్స్ కాలేజీ వద్ద మీడియాతో మాట్లాడారు. జేఏసీ నాయకులు చైర్మన్ నోముల శేషు, కొమ్మనబోయిన సైదులు యాదవ్, విజయ్ నాయక్ పాల్గొన్నారు.