ఓయూ, వెలుగు: స్టూడెంట్లకు మెస్ చార్జీలు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ ఆధ్వర్యంలో ఓయూలో కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. స్టూడెంట్లు, నిరుద్యోగులు సీఎం రేవంత్‌రెడ్డి ఫేస్‌మాస్కులు ధరించి కృతజ్ఞతలు తెలిపారు.
మానవతారాయ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలన విద్యార్థులు, నిరుద్యోగులకు స్వర్ణయుగమన్నారు.