దొంగలు అరెస్ట్ ..4.5 తులాల గోల్డ్, 45 తులాల వెండి స్వాధీనం

దొంగలు అరెస్ట్ ..4.5 తులాల గోల్డ్, 45 తులాల వెండి స్వాధీనం

ఓయూ,వెలుగు: ఇంటి తాళాలు పగలగొట్టి నగలు, నగదు ఎత్తుకెళ్తున్న ఇద్దరు పాత నేరస్తులను ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద 4.5తులాల బంగారం, 45 తులాల వెండి ఆభరణాలు, ఒక బైక్​ను స్వాధీనం చేసుకున్నారు. ఓయూ ఇన్​స్పెక్టర్ రాజేందర్​ శుక్రవారం మీడియాకు వివరాలు తెలిపారు.  

మహబూబ్​నగర్ ​జిల్లా చెదుర వెల్లికి చెందిన పొటేల్​రమేశ్​(35), కర్నాటక దౌలతాబాద్​కు చెందిన యూసఫ్​బీ(30) సిటీలో ఉంటున్నారు.  ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. జల్సాల కోసం తాళం వేసిన ఇండ్లలో బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకె ళ్తున్నారు.

హబ్సిగూడ రవీంద్రనగర్​లో ఉండే వనితారెడ్డి ఇంట్లో హౌజ్​కీపర్​సులోచన గదిలో  గత నెల26న   4.5తులాల బంగారు, 45 తులా ల వెండి ఆభరణాలు, రూ.25వేల నగదు చోరీకి గురైంది. బాధితురాలు ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం తార్నాకలో  ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు ఇన్​స్పెక్టర్ ​రాజేందర్ తెలిపారు.