ఆదివాసీగూడెంను సందర్శించిన ఓయూ రిజిస్ట్రార్‌‌‌‌

ఆదివాసీగూడెంను సందర్శించిన ఓయూ రిజిస్ట్రార్‌‌‌‌

తాడ్వాయి,  వెలుగు : అకాడమిక్ సోషల్‌‌‌‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి సమీపంలో ఉన్న సారలమ్మగుంపు ఆదివాసీగూడెంను సోమవారం ఓయూ రిజిస్ట్రార్‌‌‌‌ పి.లక్ష్మీనారాయణ సందర్శించారు. ఆయనకు ఆదివాసీలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓయూలో చదువుకున్న ఈస్రం సంతోష్‌‌‌‌, నరేశ్‌‌‌‌ ఆదివాసీ స్టూడెంట్ల కోసం స్కూల్‌‌‌‌ను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. సమాజానికి దూరంగా అడవుల్లో జీవనం సాగిస్తున్న చిన్నారులకు విద్యాబుద్ధులు

నేర్పుతున్న భీమ్‌‌‌‌ చిల్డ్రన్స్‌‌‌‌ హ్యాపీనెస్‌‌‌‌ సెంటర్‌‌‌‌ నిర్వాకులను అభినందించారు. బీసీహెచ్‌‌‌‌సీ నిర్వాహకులకు రూ. 50 వేల విరాళం అందజేశారు. స్కూల్‌‌‌‌ను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. దాదాపు 9 ఆదివాసీగూడేల్లో స్కూ్ల్స్‌‌‌‌ ఏర్పాటు చేసి ప్రాథమిక విద్యను అందజేసి, తర్వాత ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేస్తున్నామని సంతోష్‌‌‌‌, నరేశ్‌‌‌‌ వివరించారు. ఆయన వెంట ఓయూ పరిశోధక విద్యార్థులు ఉన్నారు.