కేసీఆర్​కు ఓటేయొద్దంటూ భిక్షటన : కంభంపాటి సత్యానారాయణ

కేసీఆర్​కు ఓటేయొద్దంటూ భిక్షటనకామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డిలో కేసీఆర్​కు ఓటేయొద్దంటూ ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్​  కంభంపాటి సత్యానారాయణ మంగళవారం జిల్లా కేంద్రంలో వినూత్న నిరసన తెలిపారు. కొత్త బస్టాండ్​ ఏరియాలో భిక్షాటన చేశారు. 

సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగాల ఇస్తామని చెప్పి నిరుద్యోగులను  కేసీఆర్ నిండా ముంచాడన్నారు. ఎన్నికల టైమ్​లో ఇంటికో ఉద్యోగమని చెప్పి, అతడి కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్​ను ఓడించి రాజకీయ నిరుద్యోగిని చేయాలన్నారు.