- ఓయూలో స్టూడెంట్ల నిరాహార దీక్ష
ఓయూ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఓయూలో విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. బాల్క సుమన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఆస్తులపై ప్రభుత్వం విచారణ చేయించాలని కోరారు.
ఈ నిరహార దీక్షలో విద్యార్థులు నగేష్, నర్సింహా రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీఎంకు క్షమాపణలు చెప్పాకే నకిరేకల్‌కు రావాలిబీఆర్ఎస్ నకిరేకల్ ఇన్చార్జిగా నియమితులైన బాల్కసుమన్ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన తర్వాతే అక్కడ అడుగు పెట్టాలని కాంగ్రెస్ నాయకులు వలిగొండ నర్సింహా హెచ్చరించారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌కు క్షమాపణలు చెప్పకుంటే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నిర్వహించే సభను అడ్డుకుంటామన్నారు.