Holi celebrations 2025: రంగుల మయంగా హైదరాబాద్​ రోడ్లు..ఘనంగా కామదహనం

Holi celebrations 2025:  రంగుల మయంగా హైదరాబాద్​ రోడ్లు..ఘనంగా కామదహనం

 

నగరవాసులు రంగులతో చిందేస్తున్నారు.  హ్యాపీ హ్యాపీగా హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు.  హైదరాబాద్​ వీధులు రంగులమయంగా మారాయి.  ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద హోలీ  సంబరాలు ఘనంగా జరిగాయి. డ్యాన్స్​లు చేస్తూ.. కేరింతలు కొడుతూ హోలీ వేడుకలు చేసుకుంటున్నారు.  

అయితే హోలీ పండుగ.. ముస్లింలు అతి పవిత్రంగా రంజాన్​ మాసంలో శుక్రవారం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తగా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. హోలీని శాంతియుతంగా జరుపుకోవాలని విద్యార్థులకు పోలీసులు సూచించారు.  చైతన్యపురిలో చిన్నారులు రంగులు పూసుకుంటూ డ్యాన్స్​లు.. డీజే సౌండ్స్​ తో హోరెత్తించారు.మేడ్చల్ జిల్లా దమ్మాయి  కీసరలో హోలీ పండుగ వేడుకల్లో కామదహనం కార్యక్రమాన్ని  ఘనంగా నిర్వహించారు . ఈ రోజు ( మార్చి 14) ఉదయం నుండి చిన్నారులు హోలీ కలర్లతో .. దోస్తులతో కలసి హోలీ వేడుకలు నిర్వహించుకుంటున్నారు.

Also Read : యూత్​ డీజే సౌండ్స్​.. రైన్​ డ్యాన్స్

కంటోన్మెంట్​ లో మాజీ మంత్రి మల్లారెడ్డి..

బోయినపల్లిలోమాజీ మంత్రి మేడ్చల్​ ఎమ్మెల్యే..  మల్లారెడ్డి.. ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. .. డప్పు కొడుతూ, చిన్నపిల్లలతో కలిసి  మాజీమంత్రి.. ఎమ్మెల్యే మల్లారెడ్డి డాన్సులు వేస్తూ తన సతీమణికి రంగులు పూసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు... తెలంగాణ ప్రజలు సుఖశాంతాలతో ఉండాలని మల్లారెడ్డి కోరారు..