అంబేద్కర్ అంటే భయమెందుకు? అమిత్ షా వ్యాఖ్యలపై ఓయూలో అధ్యాపకుల నిరసన

అంబేద్కర్ అంటే భయమెందుకు? అమిత్ షా వ్యాఖ్యలపై ఓయూలో అధ్యాపకుల నిరసన

ఓయూ, వెలుగు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్​షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఓయూ అధ్యాపకులు డిమాండ్​ చేశారు. ప్రొఫెసర్ సౌడ నవీన్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్​కాలేజీ వద్ద పలువురు అధ్యాపకులు సోమవారం ప్లకార్డులతో నిరసన చేశారు. తాము అంబేద్కర్​ను తలుచుకుంటే అమిత్​షాకు భయమెందుకని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగా భావిస్తున్నామన్నారు.

అంబేద్కర్ గొప్పతనాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ తక్కువ చేసే కుట్రలు చేస్తున్నాయని, ఆయన రాసిన రాజ్యాంగాన్ని, కల్పించిన రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు కొండా నాగేశ్వర్, మాయాదేవి, కరుణ సాగర్, కరుణ రూప్ల, మంచాల లింగస్వామి, నామ సైదులు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.