దేశీ సిస్టమ్స్‌తో మిసైల్.. ఆత్మనిర్భర్ వైపు అడుగులు
బాలేశ్వర్: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ పిలుపులో మరో అడుగు పడింది. శక్తిమంతమైన బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్‌కు దేశీ హంగులు అద్దింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో). సొంతంగా తయారుచేసిన మిసైల్ బూస్టర్లు, ఎయిర్‌ఫ్రేమ్ సెక్షన్లతో పాటు మరికొన్ని సబ్‌సిస్టమ్‌లను చేర్చి బ్రహ్మోస్‌కు మరింత శక్తినిచ్చింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఒడిశాలోని బాలేశ్వర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) సెంటర్లో కాంప్లెక్స్3 నుంచి ఈ మిసైల్‌ను ప్రయోగించింది. ఆ ప్రయోగంలో ‘మన బ్రహ్మోస్’ సూపర్ సక్సెస్ అయిందని తెలిపింది. అన్ని విషయాల్లోనూ మిసైల్ దూసుకుపోయిందని పేర్కొంది. ఆ ప్రయోగంపై డీఆర్డీవో బుధవారం ప్రకటన చేసింది. ఈ సక్సెస్‌తో మన దేశంలోనే మిసైల్ బూస్టర్లు, ఇతర పరికరాలను తయారుచేసేలా ఆత్మనిర్భర్ భారత్‌కు బాటలు పడ్డాయని పేర్కొంది. డీఆర్డీవో సిబ్బంది, బ్రహ్మోస్ టీమ్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, డీఆర్డీవో చైర్మన్ అభినందనలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత స్పీడ్‌గా దూసుకెళ్లే సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్. రష్యాకు చెందిన ఎన్పీవోఎంతో కలిసి డీఆర్డీవో మన దేశంలోనే వీటిని తయారు చేస్తోంది.
400 కిలోమీటర్ల రేంజ్..
భూమి, సముద్రం(సబ్మెరీన్లు), యుద్ధ విమానాల నుంచి ప్రయోగించొచ్చు. ప్రస్తుతం టెస్ట్ చేసిన మిసైల్ వెర్షన్ 400 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను నాశనంచేసే సత్తా ఉన్న ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్(ఎల్‌ఏసీఎం). దీని స్పీడ్మాక్ 2.8. అంటే సౌండ్ కన్నా 2.8 రెట్ల వేగంతో మిసైల్ దూసుకెళ్తుంది. 450 కిలోమీటర్ల టార్గెట్లను ఛేదించే మీడియం రేంజ్ మిసైల్‌ను 2017 మార్చి 11న, 300 కిలోమీటర్ల షార్ట్ రేంజ్ మిసైల్‌ను పోయినేడాది సెప్టెంబర్ 30న డీఆర్డీవో టెస్ట్ చేసింది. తాజాగా తీసుకొచ్చిన ఎక్స్‌టెండెండ్ వెర్షన్ మిసైల్ 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇప్పటికే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు కొన్ని మిసైల్స్‌ను రక్షణ శాఖ అప్పగించింది.
For More News..