దేశ ప్రజలకు దిక్సూచి మన రాజ్యాంగం: సెక్రటరీ నరహరి

దేశ ప్రజలకు దిక్సూచి మన రాజ్యాంగం: సెక్రటరీ నరహరి

గోదావరిఖని, వెలుగు: భారతరత్న బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశ ప్రజలకు దిక్సూచి అని సీనియర్ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి అన్నారు. ఆదివారం గోదావరిఖని టౌన్‎లో పూలే, అంబేద్కర్ విగ్రహాలకు ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పూలే, అంబేద్కర్ విగ్రహాల వద్ద జ్ఞానమాల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.  

అంబేద్కర్, పూలేను ఆదర్శంగా తీసుకొని ప్రజలు చైతన్యం కావాలని పేర్కొన్నారు. పూలే, అంబేడ్కర్‎పై ముద్రించిన లక్ష పుస్తకాలను పంపిణీ చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్, ఆలయ ఫౌండేషన్ సంఘం ప్రతినిధులు బొంకూరి మధు, మైస రాజేశ్, కిరణ్ రాజ్ కుమార్, గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.