న్యూఢిల్లీ: మనదేశ సరుకుల ఎగుమతులు గత నెల స్వల్పంగా 0.5 శాతం పెరిగి 34.58 బిలియన్ డాలర్లకు చేరుకోగా, వాణిజ్య లోటు 20.78 బిలియన్ డాలర్లకు తగ్గింది. సెప్టెంబర్‌లో దిగుమతులు 1.6 శాతం పెరిగి 55.36 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో వీటి విలువ 54.49 బిలియన్ డాలర్లు. ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరాన్ని వాణిజ్య లోటు అంటారు. ఇది గత ఏడాది ఇదే నెలలో 20.8 బిలియన్ డాలర్లు కాగా, ఆగస్టులో 10 నెలల గరిష్ట స్థాయి 29.65 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఔట్‌బౌండ్ షిప్‌మెంట్‌లు ఆగస్టులో 9.3 శాతం, జూలైలో 1.2 శాతం క్షీణించాయి. ఈ సంవత్సరం ఏప్రిల్-–సెప్టెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 1 శాతం పెరిగాయి.