- ఐఎంఎఫ్ ఈడీ కృష్ణమూర్తి
కోల్‌కతా: 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ సైజ్ 55 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ అన్నారు.
కోల్కతాలో బుధవారం జరిగిన సీఐఐ కార్యక్రమంలో మాట్లాడుతూ 2016 నుంచి ద్రవ్యోల్బణం లక్ష్యం దేశం సగటు ధరల పెరుగుదల రేటును ఐదు శాతానికి తగ్గించడంలో సహాయపడిందని అన్నారు. 2016కి ముందు సగటు ద్రవ్యోల్బణం 7.5 శాతంగా ఉందని ఆయన చెప్పారు.