కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది మా కుటుంబం : నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ కామెంట్స్

కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది  మా కుటుంబం : నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ కామెంట్స్

అంబేద్కర్​ను రాజకీయాల కోసం వాడుకున్న కాంగ్రెస్​
నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ కామెంట్స్

నిజామాబాద్, వెలుగు:  తమది సంచులు మోసే సంస్కృతి కాదని, జాతీయవాదాన్ని మోస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్​అన్నారు. జాతీయ పార్టీలు సంచులు, చెప్పులు మోస్తున్నాయన్న కేటీఆర్​వ్యాఖ్యలపై ఆయన ఫైర్​అయ్యారు. కేటీఆర్​చెల్లి కవిత ఢిల్లీకి లిక్కర్​సంచులు మోశారని,  రేవంత్​రెడ్డికి సంచులు మోసిన ఘనత ఉందని ఆయన ఆరోపించారు. 

ఆదివారం  ‘ గావ్​చలో.. -బస్తీ చలో’ ప్రోగ్రామ్​లో భాగంగా నిజామాబాద్ లోని అంబేద్కర్​విగ్రహాన్ని పాలతో శుద్ధి చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్​చీఫ్​ కేసీఆర్​కు తన కుటుంబం రాజకీయ భిక్ష పెట్టిందన్నారు. కేసీఆర్ టీఆర్ఎస్​పెట్టినప్పుడు అమెరికాలో ఉన్న కేటీఆర్​, కవిత తెలంగాణ ఎక్కడ వస్తదంటూ తండ్రిని తిట్టేవారని చెప్పారు.  రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్​ను కాంగ్రెస్​ ఓట్లు,  రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటుందని ఆయన ఆరోపించారు. 

ఇన్నాళ్లు కాంగ్రెస్​పాలిటిక్స్​ గురైన అంబేద్కర్​విగ్రహాలను దేశవ్యాప్తంగా పాలతో కడిగి శుద్ధి చేస్తున్నామన్నారు. ఆర్మూర్​ఎమ్మెల్యే పైడి రాకేష్​రెడ్డి, నిజామాబాద్​అర్బన్​ఎమ్మెల్యే ధన్​పాల్​సూర్యనారాయణ. నేషనల్​పసుపు బోర్డ్​ చైర్మన్​ పల్లె గంగారెడ్డి తదితరులు 

ఉన్నారు.