మా పోరాటం దుర్మార్గులపైనే..ప్రియాంకా గాంధీ కామెంట్

మా పోరాటం దుర్మార్గులపైనే..ప్రియాంకా గాంధీ కామెంట్
  • హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రియాంకా గాంధీ కామెంట్​

చండీగఢ్: తాము దుర్మార్గులకు, అన్యాయాలకు, అబద్ధాలకు మాత్రమే వ్యతిరేకంగా పోరాడుతున్నామని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం హర్యానాలో పర్యటించారు. జులనాలో కాంగ్రెస్ అభ్యర్థి రెజ్లర్ వినేశ్ ఫోగట్ కోసం ప్రచారం చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడుతూ.." హర్యానాలోని బీజేపీ సర్కార్ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసింది. ఉపాధి, అగ్నివీర్ మిలటరీ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ స్కీమ్, రైతుల సంక్షేమం వంటివి పట్టించుకోలేదు. ఈ ఎన్నికల్లో ఓడించి బీజేపీకి బుద్ది చెప్పండి. అన్యాయం, అసత్యం, దుర్మార్గులపైనే మేం పోరాడుతున్నాం. మీరు మాకు అండగా నిలబడండి" అని ప్రజలను ప్రియాంక కోరారు.

మోదీకి అంబానీ, అదానీలే ముఖ్యం

మోదీ ప్రభుత్వం కొంతమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. దేశ సంపదంతా అంబానీ, అదానీలకు ఇచ్చినందుకే దేశ యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని విమర్శించారు. ఓడరేవులు, భూములు, పరిశ్రమలు, విమానాశ్రయాలు అన్నీ బడా పారిశ్రామికవేత్తల ఆధీనంలోనే ఉన్నాయని చెప్పారు. అగ్నివీరులకు ఎలాంటి పెన్షన్ రాదని, నాలుగేళ్ల తర్వాత వారు మళ్లీ జాబ్ కోసం తిరగాల్సిందేనని చెప్పారు. పదేళ్లుగా రైతులు, జవాన్లు, మహిళలకు అన్యాయం జరుగుతోందన్నారు.

తాము దుర్మార్గులకు, అన్యాయాలకు, అబద్ధాలకు మాత్రమే వ్యతిరేకంగా పోరాడుతున్నామని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం హర్యానాలో పర్యటించారు. జులనాలో కాంగ్రెస్ అభ్యర్థి రెజ్లర్ వినేశ్ ఫోగట్ కోసం ప్రచారం చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడుతూ.." హర్యానాలోని బీజేపీ సర్కార్ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసింది. ఉపాధి, అగ్నివీర్ మిలటరీ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ స్కీమ్, రైతుల సంక్షేమం వంటివి పట్టించుకోలేదు. ఈ ఎన్నికల్లో ఓడించి బీజేపీకి బుద్ది చెప్పండి. అన్యాయం, అసత్యం, దుర్మార్గులపైనే మేం పోరాడుతున్నాం. మీరు మాకు అండగా నిలబడండి" అని ప్రజలను ప్రియాంక కోరారు.