న్యూఢిల్లీ: ఎమర్జింగ్ టెక్నాలజీలలో ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించడంలో తమ ప్రభుత్వం విజయవంతం అయ్యిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ అన్నారు. సెమీకండక్టర్ల మాన్యుఫాక్చరింగ్‌కు ఇండియా నెక్స్ట్ డెస్టినేషన్‌గా మారిందని పేర్కొన్నారు. సెమీకండక్టర్ల కంపెనీలను ఆకర్షించడానికి కాంగ్రెస్ 1980 నుంచి ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయిందని విమర్శించారు. యూఎస్ పర్యటనలో భాగంగా చిప్ కంపెనీ మైక్రాన్‌ను ప్రధాని మోడీ ఇండియాకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ గుజరాత్‌లో 825 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో ప్లాంట్ పెట్టనుంది. మైక్రాన్‌లో ప్రొడక్షన్ వచ్చే ఏడాది ప్రారంభంలో ఉండే అవకాశం ఉంది.
ALSO READ:క్యాష్ బ్యాక్ ఆఫర్ పేరుతో రూ. 4 లక్షలు కొట్టేసిన్రు
‘మోడీ విజిట్ చారిత్రాత్మకమైంది. వైట్ హౌస్‌లో ఇండియా గురించి మాట్లాడుతున్నప్పుడు గర్వంగా అనిపించింది. ఇండియాను తనతో పాటు సమానంగా యూఎస్ చూస్తోంది. ఇండియా, యూఎస్ కలిసి ముందుకెళుతున్నాయి’ అని వైష్ణవ్ పేర్కొన్నారు. పీఎం విజిట్‌లో భాగంగా సెమీకండక్టర్లు, స్పేస్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ వంటి 35 ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో పార్టనర్‌షిప్స్ కుదిరాయి. ఇండియాలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ జెట్ ఇంజిన్లను తయారు చేయనుంది. ఇందుకోసం కంపెనీ జీఈ ఏరో స్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.